newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

చిన్నారులపై అఘాయిత్యం.. నిందితులకు ఇక మరణశిక్షే!

19-07-201919-07-2019 09:46:16 IST
Updated On 19-07-2019 15:25:11 ISTUpdated On 19-07-20192019-07-19T04:16:16.466Z19-07-2019 2019-07-19T04:16:12.250Z - 2019-07-19T09:55:11.508Z - 19-07-2019

చిన్నారులపై అఘాయిత్యం.. నిందితులకు ఇక మరణశిక్షే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక అఘాయిత్యాల కేసులను అడ్డుకోవడానికి కేంద్రం నడుం బిగించింది. నిందితులకు  శిక్షల్ని పెంచడానికి, మరణశిక్షకు అవకాశం కల్పించే బిల్లును గురువారం ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

చిన్నారులపై అశ్లీల చిత్రాల నిరోధానికి సంబంధించిన నిబంధనల్ని కూడా ఇందులో చేర్చారు. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల దాకా జైలు, దానిని జీవితఖైదుగానూ మార్చే అవకాశంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. 

చిన్నారుల్ని అశ్లీల చిత్రాల కోసం ఉపయోగించుకుంటే ఐదేళ్లదాకా జైలు, జరిమానా విధిస్తారు. పోక్సోలాంటి కఠిన చట్టం ఉన్నప్పటికీ మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో చిన్నారిపై అత్యాచారం, హత్యఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చిన్నారులపై అత్యాచారం, హత్య ఘటనలను సీరియస్‌గా పరిగణించింది. గతంలో ఉన్న పోక్సో చట్టానికి పదును పెట్టింది.

గతంలో ఈ చట్టం ప్రకారం చిన్నారుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి అత్యాచారం చేసి చంపితే ఉరి శిక్ష అమలు చేస్తారు. 12 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారం వంటి ఘటనలకు పాల్పడితే మరణదండన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం  తెచ్చిన ఈ చట్టంపై సరైన ప్రచారం లేదు.

దీంతో ప్రభుత్వం కఠిన చట్టం తెచ్చినప్పటికీ ఈ దారుణాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పోలీసులు రాజకీయ పక్షాలు, స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle