newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చిదంబరానికి బెయిలా... జైలా? 26వరకూ ఉత్కంఠే!

24-08-201924-08-2019 08:22:00 IST
2019-08-24T02:52:00.408Z24-08-2019 2019-08-24T02:50:50.869Z - - 20-09-2019

చిదంబరానికి బెయిలా... జైలా? 26వరకూ ఉత్కంఠే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ఆర్థికమంత్రి భవిష్యత్ ఏంటి? ఆయనకు బెయిల్ వస్తుందా? అంతా ఉత్కంఠే. ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణ  సోమవారానికి వాయిదా వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 

ఈవ్యవహారానికి సంబంధించి ఈడీ కేసులో మాత్రం చిదంబరానికి ముందస్తు బెయిల్ లభించింది. చిదంబరం తరపున కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్ గట్టిగా వాదనలు వినిపించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ జరిపినసుప్రీంకోర్టు చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిదంబరానికి కాస్త ఊరట లభించింది. 

ఆగస్టు 26 వరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. అయితే, చిదంబరం విచారణకు మాత్రం సహకరించాలని సూచించింది. ఈడీ, సీబీఐ రెండు కేసులపైనా సోమవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. 

నాలుగు రోజుల కస్టడీని ఛాలెంజ్ చేసిన చిదంబరం న్యాయవాదులు... ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, ఈడీ ఎలాంటి అఫిడవిట్‌ను దాఖలు చేయలేదని వాదించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మక్కికి మక్కీ కాపీ చేశారని సిబల్ ఆరోపించారు. మరి సోమవారం ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle