చిదంబరానికి ఊరట.. బెయిలిచ్చిన సుప్రీం
04-12-201904-12-2019 13:14:18 IST
2019-12-04T07:44:18.694Z04-12-2019 2019-12-04T07:44:16.833Z - - 22-04-2021

తీహార్ జైలులో ఉన్న మాజీ హోం మంత్రి, ఆర్థిక మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు తీపి కబురు చెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. దీంతో 105 రోజుల తర్వాత చిదంబరం తీహార్ జైలు నుంచి విముక్తి పొందనున్నారు. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ రావడంతో ఆయనకు ఊరట లభించినట్టయింది. గత వారం కాంగ్రెస్ తాత్మాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీహార్ జైలులో చిదంబరాన్ని కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు 20 నిమిషాలకు పైగా చిదంబరంతో సమావేశం అయ్యారు. ఆయన్ను పరామర్శించిన సోనియా, త్వరలోనే కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు. వీరంతా కలిసి వచ్చిన వారంలోనే చిదంబరానికి బెయిల్ మంజూరు అయింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ చిదంబరానికి బెయిల్ ఇవ్వవద్దని గట్టిగానే వాదించింది. ఆయన బయటకొస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని వాదించింది. ఈడీ తరుపున కేసు వాదించిన సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా.. చిదంబరం లాంటి వ్యక్తులకు బెయిల్ ఇస్తే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ప్రత్యేకించి అధికార దుర్వినియోగానికి పాల్పడి మనీ లాండరింగ్ లేదా ఆర్థిక అవకతవలకు సంబంధించిన కేసుల్లో ఉన్నవారికి బెయిల్ ఇవ్వరాదన్నారు. అయితే నిరాధార ఆరోపణలతో చిదంబరాన్ని జైల్లో పెట్టాలనుకోవడం సరికాదని ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్,ఏంఎం సింఘ్వీ వాదించారు. ఈడీ వాదనతో ఏకీభవించని కోర్టు ఎట్టకేలకు చిదంబరానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన తీహార్ జైలునుంచి ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
7 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
10 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
14 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
14 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
14 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
12 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా