చిదంబరం అరెస్ట్ గ్యారంటీనా..? ఇంటికొచ్చిన సీబీఐ?
21-08-201921-08-2019 11:35:28 IST
Updated On 21-08-2019 11:58:08 ISTUpdated On 21-08-20192019-08-21T06:05:28.238Z21-08-2019 2019-08-21T06:05:26.246Z - 2019-08-21T06:28:08.342Z - 21-08-2019

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరంను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు రెడీ అయ్యారా? అసలేం జరుగుతోంది? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. మంగళవారం ఉదయం మూడోసారి సీబీఐ అధికారులు ఢిల్లీలోని ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో సీన్ మారిపోయింది.
ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం చిదంబరంకు ముందస్తు బెయిల్ మంజూరు నిరాకరించింది. దీంతో గత రాత్రి నుంచి చిదంబరం కోసం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గత రాత్రి అధికారులు ఢిల్లీలోని చిదంబరం ఇంటికి వెళ్లగా ఆయన అక్కడ కనిపించలేదని తెలుస్తోంది.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నేడు చిదంబరం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ ఎన్వీ రమణ ముందుకు వచ్చింది. అయితే దీనిపై తాను ఉత్తర్వులు ఇవ్వలేనన్నారు. తక్షణ విచారణ కోసం ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి ముందుకు పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో చిదంబరానికి అరెస్టు ముప్పు తప్పేలా లేదు.
చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు నోటీసులు అంటించారు. రెండు గంటల వ్యవధిలో తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం మూడోసారి ఢిల్లీలోని చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. చిదంబరం ఇంటికి వచ్చిన మరుక్షణం ఆయన్ను సీబీఐ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై అరెస్ట్ కత్తి వేలాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు
గౌరవ రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దేశం కోసం కొన్ని దశాబ్దాల తరబడి విధేయుడిగా పనిచేస్తున్నాడని ప్రియాంక అన్నారు. చిదంబరంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిదంబరం నిస్సంకోచంగా నిజాలు మాట్లాడుతారని.. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతారని చెప్పారు. కానీ చిదంబరం చెప్పే నిజాలు జీర్ణించుకోలేక ఆయన్ను వెంటాడుతున్నారని ఆరోపించారు.
ఇలాంటి తరుణంలో తామంతా చిదంబరంకు అండగా నిలుస్తామని.. నిజం మాట్లాడటం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రియాంక ట్వీట్లో ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావించకపోయినా పరోక్షంగా వారినే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందునే చిదంబరంపై కక్ష గట్టి కేసులతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిదంబరం విషయంలో సీబీఐ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా