newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చిచ్చురేపుతున్న పౌరసత్వ బిల్లు.. ఈశాన్యంలో ఉద్రిక్తత

11-12-201911-12-2019 09:38:25 IST
Updated On 11-12-2019 09:38:22 ISTUpdated On 11-12-20192019-12-11T04:08:25.501Z11-12-2019 2019-12-11T04:08:00.552Z - 2019-12-11T04:08:22.199Z - 11-12-2019

చిచ్చురేపుతున్న పౌరసత్వ బిల్లు.. ఈశాన్యంలో ఉద్రిక్తత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.  అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరమ్, త్రిపుర రాష్టాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. వివిధ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిరసనలు జరిగాయి. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Image

ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల సంఘం(ఎన్ఈఎస్ఓ) ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లో బంద్ నిర్వహిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాల బంద్ కు తమ మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మిజోరమ్, త్రిపుర రాష్ట్రల ప్రభుత్వాలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

పౌరసత్వ సవరణ బిల్లు నుంచి ఇన్‌ల్యాండ్ పర్మిట్ అమలవుతున్న ప్రాంతాలను మినహాయించడంతో తాము బంద్ పిలుపును ఉపససంహరించుకుంటున్నామని మణిపూర్ పీపుల్ అగెయినెస్ట్ సీఎబీ(మాన్‌పాక్) సంస్థ ప్రకటించింది. దీంతో ఆందోళనల స్థాయి తగ్గింది.

ఇదిలా వుంటే.. తీవ్ర నిరసనలు, వాదోపవాదాలు, విమర్శలు, సవరణలకు డిమాండ్ల మధ్య పౌరసత్వ సవరణ బిల్లుకి 311–80 ఓట్ల తేడాతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. పొరుగు దేశాల్లో ఉన్న ముస్లిమేతరులకు భారత్‌ పౌరసత్వాన్నిచ్చే పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం ఎగువ సభలో ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. ఈబిల్లుపై చర్చకు 6 గంటలు కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ బిల్లుపై రాజ్యసభలో ఎలాంటి చర్చ జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లోక్‌సభలో బిల్లుకి మద్దతు తెలిపింది శివసేన. బిల్లుపై నెలకొన్న సందేహాలను తీర్చనట్లయితే రాజ్యసభలో మద్దతివ్వబోమని పార్టీ అధినేత మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. అయితే ఈవిషయంలో యూ టర్న్‌ తీసుకుంది.

Image

ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యల్ని స్వాగతించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వ సవరణ బిల్లు పాసయితే రాజ్యాంగంపైన దాడి జరిగినట్లేనని వ్యాఖ్యానించారు.రాజ్యసభలో అధికార బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే బిల్లును పాస్ చేయించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా కనీసం 124–130 ఓట్లు వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. విపక్షాల బలం 90–93కి పరిమితమైపోతుందని అంచనా వేస్తోంది. మరి రాజ్యసభలో బీజేపీ అంచనాలు నిజమవుతాయో లేదో చూడాలి. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   2 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   12 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle