newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

గ‌వ‌ర్న‌ర్ ట్విస్ట్‌.. శివ‌సేన‌కు షాక్‌

12-11-201912-11-2019 07:38:54 IST
2019-11-12T02:08:54.547Z12-11-2019 2019-11-12T02:08:22.788Z - - 13-12-2019

గ‌వ‌ర్న‌ర్ ట్విస్ట్‌.. శివ‌సేన‌కు షాక్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు త‌గినంత బ‌లం పొంద‌లేక‌పోయామ‌ని, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం లేద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌వ‌ర్న‌ర్‌కు చెప్ప‌డంతో శివ‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటుకు క‌స‌ర‌త్తు చేసింది. శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ థాక్రే వెంట‌నే చ‌ర్చ‌లు మొద‌లుపెట్టారు.

సైద్ధాంతికంగా విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వే ల‌క్ష్యంగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ), కాంగ్రెస్ పార్టీతో చ‌ర్చ‌లు జ‌రిపారు. బీజేపీ దూకుడును అడ్డుకోవాల‌నే ల‌క్ష్యంతో ఈ రెండు ప‌క్షాల నుంచీ సానుకూల స్పంద‌న వ‌చ్చింది.

తాము ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తు ఇవ్వాలంటే ఎన్‌డీఏ నుంచి శివ‌సేన వైదొల‌గాల‌ని శ‌ర‌ద్ ప‌వార్ ఓ ష‌ర‌తు పెట్టారు. ఈ ష‌ర‌తుకు వెంట‌నే అంగీక‌రించిన శివ‌సేన త‌మ కేంద్ర‌మంత్రిని రాజీనామా చేయించింది.

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి శివ‌సేన తీసుకొని రెండు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు ఇవ్వాల‌ని శివ‌సేన భావించింది. మ‌హారాష్ట్ర ప‌రిణామాల‌పై చ‌ర్చించిన కాంగ్రెస్ పెద్ద‌లు శివ‌సేన‌కు బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ఇక శివ‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌ని, మొద‌టిసారి శివ‌సైనికుడు ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబోతున్నార‌నే అంతా భావించారు.

కానీ, అనూహ్యంగా శివ‌సేన‌కు షాకిచ్చారు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్‌, ఎన్‌సీపీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా శివ‌సేన లేఖ‌లు గ‌వర్న‌ర్‌కు స‌మ‌ర్పించ లేక‌పోయింది. ఇందు కోసం మ‌రో మూడు రోజులు స‌మ‌యం ఇవ్వాల‌ని కోరింది. కానీ, గ‌వ‌ర్న‌ర్ ఇందుకు నిరాక‌రించి మూడో పెద్ద పార్టీగా ఉన్న ఎన్‌సీపీని ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.

ఊహించ‌ని ఈ ప‌రిణామంతో మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వ ఏర్పాటు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానానికి ఎన్‌సీపీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగానే ఈ ప‌రిణామాలు జ‌రుగుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా శివ‌సేన‌, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఇంకా స‌న్న‌ద్దాల్లో ఉండ‌గానే రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు ఆదేశించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మొత్తానికి మొద‌టిసారి మ‌హారాష్ట్ర‌లో అధికారాన్ని చేపట్టాల‌నే ఆశ‌తో ఉన్న శివ‌సేన క‌ల‌లు ఈసారి నెర‌వేర‌డం అనుమానంగానే ఉంది. ఒకవేళ ఆ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోతే, ఇప్ప‌టికే ఎన్‌డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినందున అంటు రాష్ట్రంలో అధికారం కోల్పోయి, కేంద్రంలో అధికార ప‌క్షం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రెండు విధాలుగా శివ‌సేన న‌ష్ట‌పోతుంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle