గ్రేటర్ నోయిడాలో త్వరలో అతిపెద్ద ఫిలిం సిటీ..
19-09-202019-09-2020 13:24:23 IST
Updated On 19-09-2020 13:40:26 ISTUpdated On 19-09-20202020-09-19T07:54:23.810Z19-09-2020 2020-09-19T07:54:21.056Z - 2020-09-19T08:10:26.451Z - 19-09-2020

కరోనా కారణంగా సినీ పరిశ్రమ మొత్తం మూతపడింది. థియేటర్లు కూడా అయిదు నెలల నుంచి క్లోజ్ అయి ఉన్నాయి. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలీదు. కరోనా వల్ల అన్ని పరిశ్రమల కంటే ఎక్కువ నష్టపోయింది సినీ పరిశ్రమే. సినీ పరిశ్రమ ఇప్పట్లో కోలుకునేలా కనిపించట్లేదు కరోనా దెబ్బకి. ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చినా ఇంకా చాలా మంది షూటింగ్స్ మొదలు పెట్టలేదు. దేశంలోని అన్ని సినీ పరిశ్రమలలో షూటింగ్స్ చాలా వరకు ఫిలింసిటీలలో, లేదా ఖాళీ ప్రదేశాలలో సెట్స్ వేసి తీస్తారు. కొంచెం భారీ బడ్జెట్ సినిమాలకు విదేశాలకు వెళ్తూ ఉంటారు. చాలా దేశాలలో సినిమా షూటింగ్స్ కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాలు ఫ్రీగా కూడా షూటింగ్ కి అనుమతులు ఇస్తాయి. తమ దేశం గురించి తెలియడానికి సినిమాలకు కొన్ని దేశాలు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాయి. అందుకే చాలా సినిమాలు ఈ మధ్య విదేశాలలోని షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. మన దేశంలో అయితే హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిలింసిటీ చాలా పెద్దది. దేశంలోని అన్ని సినీ పరిశ్రమల సినిమాలు ఇక్కడ రూపు దిద్దుకుంటాయి. అయితే కరోనా వల్ల ఇప్పుడు విదేశాలకు వెళ్లి షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. అందరూ ఇక్కడే షూట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని గమనించిన కొన్ని ప్రభుత్వాలు సినీ షూటింగ్స్ కి సపోర్ట్ చేస్తూ అనుమతులు ఇస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో షూటింగ్ కి ఉపయోగపడే ప్రదేశాలను వెతికి పట్టుకొని పర్మిషన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సినిమాలకు అనుకూల పరిస్థితులు కల్పించాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధనగర్ జిల్లా నోయిడా, గ్రేటర్ నోయిడా నగరాల్లో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని, ఫిలింసిటీ నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో స్థలాన్ని చూసి ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులని ఆదేశించారు. గౌతమబుద్ధ నగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్లు సీఎం యోగి ప్రకటించారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటితో పాటు ఈ ఫిలింసిటీ కూడా చేరనుంది.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
35 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
7 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా