newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

గోలీ మారో నే మా కొంప ముంచింది: అమిత్ షా

14-02-202014-02-2020 10:42:58 IST
Updated On 14-02-2020 13:26:30 ISTUpdated On 14-02-20202020-02-14T05:12:58.939Z14-02-2020 2020-02-14T05:12:56.319Z - 2020-02-14T07:56:30.642Z - 14-02-2020

గోలీ మారో నే మా కొంప ముంచింది: అమిత్ షా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొంతమంది బీజేపీ నేతల వ్యాఖ్యల కారణంగా ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతెలిపారు. ‘‘దేశ్‌ కే గదరానోంకో గోలీమారో’’ (దేశ ద్రోహులను కాల్చండి) వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, ఈ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని షా వ్యాఖ్యానించారు. గత అయిదారేళ్లుగా దేశంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి తన వ్యూహం విఫలమైందని, ఎన్నికల అంచనాలు తప్పాయిని అమిత్ షా అంగీకరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉగ్రవాది అంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా సీఏఏకు వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నిరసనలు, ధర్నాలు జరగడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్‌ మాత్రం బీజేపీపై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా.. తాను అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. 

ఈ క్రమంలో ఫిబ్రవరి 11న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సొంతం చేసుకోగా.. బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 62 సీట్లు ఆప్‌ గెలుచుకోగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. 

అయితే విజయం కోసమో లేక పరాజయం పొందడం కోసమో బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో పోరాటం చేయలేదని, ఈ ఎన్నికల ద్వారా తమ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని విస్తరించుకున్నామని తాము విశ్వసిస్తున్నామని షా చెప్పుకొచ్చారు. దేశద్రోహులను కాల్చండి అనే వ్యాఖ్యల నుంచి తమ పార్టీ దూరం జరిగివుండాల్సిందని షా పేర్కొన్నారు. 

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తాము తలపెట్టిన పౌర సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలపై ప్రజా తీర్పుగా తాను భావించడం లేదని షా తేల్చి చెప్పారు. ఇప్పుడు సైతం ఎవరైనా సీఏఏ తదితర అంశాలపై చర్చలు జరపాలని తలుస్తున్నట్లయితే వారు తన కార్యాలయానికి వచ్చి నేరుగా కలవచ్చని అమిత్ షా ఆహ్వానం పలికారు. ఈ చర్చ కోసం తాను మూడురోజుల సమయం కేటాయిస్తానని చెప్పారు.

"జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఎన్నికల్లో పోరాడుతూ వచ్చాను. ఢిల్లీ ఎన్నికలు నాకు కొత్తవేం కాదు. కాని ఫలితాలు మాత్రం మాకు అనుకూలంగా రాలేదు. ఫలితాలు మనకు అనుకూలంగా చాలా సందర్భాల్లో రాకపోవచ్చు. కానీ అదే స్ఫూర్తితో నేను పనిచేసుకుంటూ పోయాను. నేను ప్రాథమికంగా బీజేపీ కార్యకర్తను. చాలామంది ప్రజల వద్దకు నా సిద్ధాంతాన్ని తీసుకుపోయి వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాను. ఏదో ఒక ప్రాథమిక అంశంపై ఆధారపడి ఎన్నికల పోరాటాలు జరగవు. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శనలు ఎలా జరగాలనే విషయంలో మా వైఖరి మారబోదు అని అమిత్ షా స్పష్టం చేశారు."

 

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   8 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   8 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   10 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   11 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   13 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   16 hours ago


కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

కృష్ణానదిలో అంతకంతకూ పెరుగుతున్న వరద!

   17 hours ago


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి సిపిఐ నేత రామకృష్ణ లేఖ

   17 hours ago


హిందీ రాదా.. మీరు భారతీయులేనా... కనిమొళికి విమానాశ్రయంలో షాక్

హిందీ రాదా.. మీరు భారతీయులేనా... కనిమొళికి విమానాశ్రయంలో షాక్

   18 hours ago


కోవిడ్-19 టెస్టుల్లో రకాలు.. ఎలా చేస్తారో తెలుసా?

కోవిడ్-19 టెస్టుల్లో రకాలు.. ఎలా చేస్తారో తెలుసా?

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle