గెలిస్తే మంత్రి పదవులు.. రెబల్స్కి బీజేపీ టికెట్లు
15-11-201915-11-2019 14:40:19 IST
Updated On 15-11-2019 16:54:46 ISTUpdated On 15-11-20192019-11-15T09:10:19.133Z15-11-2019 2019-11-15T09:10:09.682Z - 2019-11-15T11:24:46.257Z - 15-11-2019

కర్నాటక రాజకీయం ఎవరికీ అంతుచిక్కదు. కర్నాటకలో కుమారస్వామిని గద్దెదింపడంలో కీలక పాత్ర పోషించారు. వీరి పదవులు పోవడంతో బీజేపీ వారికి అండగా నిలబడింది. కర్నాటకలో కుమారస్వామి సర్కార్ విశ్వాసపరీక్ష సందర్భంగా అనర్హత వేటుకు గురైన రెబెల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు బీజేపీ అవకాశం ఇచ్చింది. వీరిని గెలిపించుకునే బాధ్యతను సీఎం యడియూరప్ప భుజాన వేసుకుంటున్నారు.
అంతేకాదు వీరందరిలో కొందరికి మంత్రులుగా కూడా అవకాశం ఇస్తానని యడియూరప్ప బంపర్ ఆఫర్ ఇచ్చారు. వీరంతా బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తారని అన్నారు. డిసెంబర్ 5న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వీరికి బీజేపీ టికెట్లు ఇవ్వడంతో వీరి గెలుపు ఖాయం అని అంటున్నారు.

జేడీఎస్, కాంగ్రెస్ రెబెల్స్ మహేష్ కుమతల్లి, శ్రీమంతగౌడ పాటిల్, రమేష్ జర్కిహోలి, శివరాం హెబ్బర్, బీసీ పాటిల్, ఆనంద్ సింగ్, కే సుధాకర్, భైరతి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, కే గోపాలయ్య, ఎంటీబీ నాగరాజ్, కేసీ నారాయణ గౌడ, హెచ్ విశ్వనాధ్లు ఈసారి బీజేపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వీరికి ధీటైన అభ్యర్ధుల కోసం జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు అన్వేషిస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీచేసేందుకు వీరిని అనర్హులిగా ప్రకటించిన స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో బీజేపీలో చేరుతామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. వీరికి బీజేపీ టికెట్లు ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఈ పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. 15 మంది రెబెల్స్ వల్లే తాను సీఎం అయ్యానని, వీరందరినీ గెలిపించుకుంటానని యడియూరప్ప అంటున్నారు. మరి ఈ స్థానాలన్నీ కమలం ఖాతాలోకి వెళతాయా? ఎంతమంది గెలుస్తారో చూడాలి.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
3 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
5 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా