newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గులాం నబీ పదవి గోవిందా.. అసమ్మతిపై కొరడా

12-09-202012-09-2020 22:08:13 IST
2020-09-12T16:38:13.984Z12-09-2020 2020-09-12T16:38:10.727Z - - 17-04-2021

గులాం నబీ పదవి గోవిందా.. అసమ్మతిపై కొరడా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి లేఖ పంపిన అసమ్మతి వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీలను మారుస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అదేవిధంగా ఇటీవల పార్టీపై లేఖాస్త్రం సంధించిన బృందం నాయకుడు గులాం నబీ ఆజాద్‌ ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. ఆజాద్‌తో పాటు సీనియర్‌ నాయకులు మోతీలాల్‌ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్‌ వాస్నిక్, రణ్‌ దీప్‌ సింగ్‌ సూర్జేవాలాలకు చోటు కల్పించారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్‌ సభ్యులుగా చిదంబరం, రణ్‌దీప్‌ సూర్జేవాలా, తారిఖ్‌ అన్వర్, జితేంద్ర సింగ్‌లను తీసుకున్నారు. లుజిన్హొ ఫెలిరియో, మోతీలాల్‌ వోరా, ఆధిర్‌ రంజన్‌ చౌధురి, తామ్రధ్వజ్‌ సాహులను సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తొలగించారు. లిరియోను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. ఆజాద్‌ను హరియాణా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ పదవి నుంచి తొలగించి, వివేక్‌ బన్సాల్‌ను ఆ పదవిలో నియమించారు.

కాంగ్రెస్‌పార్టీలో సంస్కరణలు అవసరమని, క్రియాశీల అధ్యక్షుడి అవసరం పార్టీకి ఉందంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్‌ నేతల్లో.. గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. సీడబ్యూసీ కొత్త సభ్యుల్లో దిగ్విజయ్, రాజీవ్‌ శుక్లా, మానికం టాగోర్, ప్రమోద్‌ తివారీ, జైరాం రమేశ్, హెచ్‌కే పాటిల్, సల్మాన్‌ ఖుర్షీద్, దినేశ్‌ గుండూరావు తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జిగా ఉమెన్‌ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్‌చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్‌ ఎంపీ మాణిక్కం టాగూర్‌ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. ప్రక్షాళనలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపడం విశేషం.

వర్కింగ్‌ కమిటీలోనూ, కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ కాంగ్రెస్‌ నాయకత్వం శుక్రవారంనాడు భారీగా మార్పులు చేసింది. రాహుల్‌ విధేయులందరికీ కీలక పదవులను అప్పగించి- రానున్న నెలల్లో ఆయన పగ్గాలు చేపట్టేందుకు బాటలు వేసింది. పాత తరానికి ఉద్వాసన పలికింది. అన్నింటి కంటే ముఖ్యంగా.. అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్‌ నాయకుడు, గులాం నబీ ఆజాద్‌పై పార్టీ హైకమాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. 

పార్టీలో సమగ్ర సంస్కరణలు, కిందిస్థాయి నుంచి ఎన్నికలు కోరుతూ లేఖ రాసిన 23 మందిలో గులాంనబీయే అగ్రనేత, ఆ అంశాన్ని వర్కింగ్‌ కమిటీలో నడిపిన వ్యక్తి. ఈ లేఖ రాసినందుకు తనకెవరిపైనా శత్రుత్వం, ద్వేషం లేదని చెబుతూనే సోనియా తాజాగా ఆయనను పదవీచ్యుతుణ్ని చేయడం విశేషం. ఆజాద్‌తో పాటు లేఖపై సంతకాలు చేసిన జితిన్‌ ప్రసాద, ముకుల్‌ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించారు. లేఖ రాసినందుకు క్షమాపణ చెప్పిన ముకుల్‌ వాస్నిక్‌ను సోనియాకు సహాయపడే ప్రత్యేక కమిటీలో చేర్చారు. ఎన్నికలు జరిపి సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని అసమ్మతి బృందం డిమాండ్‌ చేయగా అందుకు భిన్నంగా తాత్కాలిక ఇన్‌ఛార్జి హోదాలోనే కమిటీని ప్రక్షాళించడం, అందునా రాహుల్‌ విధేయులనే చేర్చడం విశేషం.

అసమ్మతి లేఖపై సంతకం చేసిన మరికొందరు ప్రముఖులకు కూడా ఏఐసీసీలో, వర్కింగ్‌ కమిటీలో ఎలాంటి స్థానమూ దక్కలేదు. వీరిలో శశి థరూర్‌, మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ ఉన్నారు. అదే విధంగా రాజస్థాన్‌లో తిరుగుబాటు బావుటా ఎగరేసి రాహుల్‌-ప్రియాంకల చొరవతో కాంగ్రె్‌సలోనే ఉండిపోయిన సచిన్‌ పైలట్‌కూ ఎలాంటి స్థానం ఇవ్వలేదు. అయితే ఆయన జాతీయ రాజకీయాలకు రావడానికి విముఖంగా ఉన్నట్లు వినిపిస్తోంది. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   11 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   21 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle