newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

గురువారం కుమారస్వామికి ‘అగ్ని పరీక్ష’

15-07-201915-07-2019 15:49:01 IST
Updated On 16-07-2019 10:48:02 ISTUpdated On 16-07-20192019-07-15T10:19:01.622Z15-07-2019 2019-07-15T10:10:48.985Z - 2019-07-16T05:18:02.304Z - 16-07-2019

గురువారం కుమారస్వామికి ‘అగ్ని పరీక్ష’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కుమారస్వామి బలపరీక్షకు రంగం సిద్ధమయింది. ఈనెల 18న కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధపడనుంది. ఈమేరకు స్పీకర్ రమేష్ కుమార్ ఈ విషయం ప్రకటించారు. గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని, శాసనసభలో విశ్వాసపరీక్షకు సిద్ధంగా ఉన్నానని గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించారు. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కుమారస్వామే బలపరీక్షను ఎదుర్కొంటానని ప్రకటించడంతో బీజేపీ వత్తిడి ప్రారంభించింది. ఈనెల 15నే (సోమవారం) విశ్వాస పరీక్ష పెట్టాలని పట్టుబట్టింది. అయితే ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. రాజీనామాలపై నిర్ణయం వెలువరించడానికి స్పీకర్ మంగళవారం వరకూ గడువు కోరారు. ఈ తీర్పు వచ్చాకే బలపరీక్ష పెడతామని, అందుకు అధికార పక్షం సిద్ధంగా ఉండాలని స్పీకర్‌ రమేశ్ కుమార్ పేర్కొన్నారు.

సుప్రీం తీర్పు కంటే ముందే బలపరీక్ష పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు చేతబట్టి శాసనసభలో నిరసన తెలిపారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధ రామయ్య మాట్లాడుతూ గురువారం తమ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుందని చెప్పారు. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది.

మెజారిటీకి అవసరం అయిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది.  శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 107.  రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం 101 అవుతుంది.  ఇలాంటి సమయంలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఎలా గట్టెక్కుతారో చూడాలి. మరోవైపు కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలు తమకు రక్షణ కల్పించాలని ముంబై పోలీసులను కోరారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle