newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గుడ్ న్యూస్... ఆగస్ట్ 3న కరోనా వ్యాక్సిన్ విడుదల..!

21-07-202021-07-2020 09:04:30 IST
Updated On 21-07-2020 10:56:23 ISTUpdated On 21-07-20202020-07-21T03:34:30.175Z21-07-2020 2020-07-21T03:34:19.761Z - 2020-07-21T05:26:23.976Z - 21-07-2020

 గుడ్ న్యూస్... ఆగస్ట్ 3న కరోనా వ్యాక్సిన్  విడుదల..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రపంచంలో 14,854, 330 కేసులున్నాయి. మరణాలు 6 లక్షల 13 వేల 213కి చేరాయి. 89 లక్షల 7 వేల 62 మంది రికవరీ అయ్యారు. ప్రథమ స్థానంలో వున్న అమెరికాలో 39లక్షల 61 వేల 429 కేసులు నమోదు కాగా, మరణాలు లక్షా 43 వేల 834గా వున్నాయి. బ్రెజిల్ లో 21 లక్షల 21 వేల 645 పాజిటివ్ కేసులు, 80, 251 మరణాలు సంభవించాయి. మూడవ స్థానంలో వున్న ఇండియాలో 11లక్షల 54 వేల 917 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాలు 28099కి పెరిగాయి. 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈమేరకు ప్రకటన చేశారు రష్యా హెల్త్ మినిస్టర్. ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేలాది మందిపై నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయ వంతంగా పూర్తైనట్లు ఆయన ప్రకటించడంతో కరోనా బాధితుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బతుకు ఆశ కలుగుతోంది. 

అన్ని సక్రమంగా జరిగినట్లయితే... ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుందని డాక్టర్లు అంటున్నారు. ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది. వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle