newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గుజరాత్‌లో మందేసి చిందేసిన జూనియర్ డాక్టర్లు.. 12మంది అరెస్ట్

24-06-202024-06-2020 09:45:04 IST
2020-06-24T04:15:04.093Z24-06-2020 2020-06-24T04:14:00.713Z - - 12-04-2021

గుజరాత్‌లో మందేసి చిందేసిన జూనియర్ డాక్టర్లు.. 12మంది అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలే కరోనా వైరస్ మహమ్మారి వీరవిహారం చేస్తున్న రోజులు. గుజరాత్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగానే వుంది. అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న గుజరాత్‌లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గుజరాత్ లో 27880 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం 1685 మరణాలు సంభవించాయి. ప్రతిరోజూ వందలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

అందునా మద్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో మందేసి చిందేశారు. ఆ పార్టీ చేసుకున్నది కూడా మామూలు జనం కాదు. ఏకంగా 12 మంది జూనియర్ వైద్యులు మందుపార్టీ చేసుకుని హల్ చల్ చేశారు. దీంతో గుజరాత్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ హైదరాబాదీతోపాటు ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. వడోదర రూరల్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వడోదరలోని సుమన్‌దీన్ విద్యాపీఠ్‌తోపాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్‌దీప్ ఆసుపత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు చదువుకుంటున్నారు. గుజరాత్‌లోని మీన్‌నగర్ ప్రాంతానికి చెందిన జైన్ మెహతా, ఘట్లోడియాకు చెందిన కిరణ్ మెహతాలు జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. తన సహచరులైన మరో 10 మందితో కలిసి ఆమోదర్ గ్రామంలోని శ్యామల్ కౌంటీలో మందు పార్టీ చేసుకున్నారు. 

ఈ బృందంలో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు. వారు మద్యం తాగుతున్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం 12 మందినీ అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి స్వదేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మందు పార్టీ సందర్భంగా  పట్టుబడిన వారిలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌‌కు చెందిన వారితో పాటు హైదరాబాద్‌కు చెందిన జూనియర్‌ డాక్టర్‌ కోషి జోసెఫ్‌ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన 12 మందినీ ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంతమంది పార్టీ ఎలా చేసుకున్నారని, వారికి మందు ఎలా సప్లయ్ అయిందనే దానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle