newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు.. ప్రియాంక

20-08-202020-08-2020 07:37:37 IST
Updated On 20-08-2020 07:47:25 ISTUpdated On 20-08-20202020-08-20T02:07:37.742Z20-08-2020 2020-08-20T02:07:31.322Z - 2020-08-20T02:17:25.918Z - 20-08-2020

గాంధీ కుటుంబానికి అధ్యక్ష పదవి వద్దు.. ప్రియాంక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్న బాటలో చెల్లెలు కూడా నడిచింది అంటే ఈ కథనానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వ భారం తనమీద మోపవద్దని, పదవుల కోసం వెంపర్లాట తప్ప, బాధ్యతలు పట్టించుకోని వృద్ధ నాయకత్వం కోసం తాను పనిచేయలేనని చెప్పి కాడి దింపి కీలక పదవినుంచి అన్న రాహుల్ గాంధీ తప్పుకోగా, కాస్త లేటుగా అయినా చెల్లెలు ప్రియాంక కూడా తనదీ అన్న బాటే అని చెప్పేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమే అని స్థిరపడిపోయిన సాంప్రదాయాన్ని ప్రియాంక బద్దలు గొట్టేశారు.

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులు కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిన పని లేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు. తమ ఇంటి సభ్యులు కాకుండా బయట వ్యక్తులకే కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాలన్న తన సోదరుడు రాహుల్‌ అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు. పార్టీని నడిపే సత్తా కలిగిన నాయకులు ఎందరో ఉన్నారని తాజాగా విడుదలైన పుస్తకంలో తన మనసులో మాట వెల్లడించారు. అమెరికా విద్యావేత్తలు ప్రదీప్‌ చిబ్బర్, హర్ష షాలు రచించిన ‘‘ఇండియా టుమారో  కన్వర్జేషన్‌ విత్‌ ది నెక్స్‌‌ట్ జనరేషన్‌ ఆఫ్‌ పొలిటికల్‌ లీడర్స్‌’’ అన్న పుస్తకంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. 

గాంధీ కుటుంబంపై ఆధారపడకుండా కాంగ్రెస్‌కు సొంత దారంటూ ఉండాలని ప్రియాంక వ్యాఖ్యానించినట్టుగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ద్వారా విడుదలైన ఆ పుస్తకం వెల్లడించింది. ‘‘రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా లేఖలోనే కాదు, చాలా సార్లు తన మనోగతాన్ని విప్పి చెప్పారు. మన కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడు కావాల్సిన అవసరం లేదన్నారు. నేను కూడా రాహుల్‌కి మద్దతుగా ఉంటా’’అని ప్రియాంక చెప్పారు.

దేశంలో యువ రాజకీయ నేతల్ని పుస్తక రచయితలు గత ఏడాది ఇంటర్వ్యూ చేశారని, ప్రియాంక వెల్లడించిన అభిప్రాయాలు అప్పటివని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గత ఏడాది మే 25న రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా గాంధీ కుటుంబానికి చెందని వారిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని కూడా సలహా ఇచ్చారు.  గత ఏడాది జూలైలో అమెరికాకు చెందిన రచయితలు ప్రియాంక అభిప్రాయాన్ని  తెలుసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు  తాను వ్యతిరేకమని ప్రియాంక వారికి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి రాహుల్‌ చేసిన కృషిని ప్రియాంక కొనియాడారు. 

‘‘గాంధీ కుటుంబేతరుడు కాంగ్రెస్ అధ్యక్షుడైనా... నాకు ఓకే. మీ అవసరం యూపీలో లేదు. అండమాన్ నికోబార్‌లో ఉంది. అక్కడికి వెళ్లండని ఆ కొత్త అధ్యక్షుడు ఆదేశించినా... సంతోషంగా అండమాన్ వెళ్లి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తా’’ అని ఆమె సంచలన ప్రకటన చేశారు.

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ‘‘గాంధీ కుటుంబేతరుడు అధ్యక్షుడు అయినా ఓకే.. నాకు ఆమోదమే’’ అని రాహుల్ అన్న వ్యాఖ్యలను ప్రియాంక పూర్తిగా సమర్థించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. 

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గాంధీ కుటుంబేతరుడు చేపట్టవచ్చని అన్నా చెల్లెలు ఇద్దరూ అభిప్రాయం తెలుపడం, కాంగ్రెస్ పార్టీ ఇకపై కొత్త పంథా ఎంచుకోవలిసిన అవసరం ఉందని ప్రియాంక నొక్కి చెప్పడం చూస్తుంటే వారసత్వ రాజకీయాల ఊబిలో చిక్కుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచిరోజులు వస్తున్నాయని ఆ పార్టీ అభిమానులు సంబరపడుతున్నారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle