newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాంధీలో కరోనా పేషేంట్.. కేంద్ర-రాష్ట్రాల మధ్య భిన్నవాదనలు!

14-03-202014-03-2020 12:52:26 IST
2020-03-14T07:22:26.088Z14-03-2020 2020-03-14T07:22:22.939Z - - 11-04-2021

గాంధీలో కరోనా పేషేంట్.. కేంద్ర-రాష్ట్రాల మధ్య భిన్నవాదనలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యావత్ రెండు తెలుగు రాష్ట్రలను వణికించిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకున్నాడు. తెలంగాణలో పాజిటివ్ నమోదైన తొలికేసు ఇదే కాగా అతనికి పూర్తిగా నయమైందని.. డిశ్చార్చి చేస్తామని సాక్షాత్తు ఏకంగా రాష్ట్ర వైద్య-ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించారు. నగరంలోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సదరు వ్యక్తిని చెప్పినట్లుగానే డిశ్చార్జి కూడా చేశారు.

దాదాపుగా మొత్తం పదిరోజుల పాటు అతనికి ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స అందించారు. దీనిపై స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించడం సంతోషంగా ఉందని.. ప్రస్తుతం తెలంగాణాలో ఒక్క వ్యక్తికీ కూడా కరోనా పాజిటివ్ లేదని స్పష్టం చేశారు.

కానీ.. ఈ వ్యక్తి విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడినట్లుగా కనిపిస్తుంది. మంత్రి ఈటల ప్రకటనకి భిన్నంగా కేంద్రం మాత్రం మహమ్మారి నుండి కోలుకున్న వారి జాబితాలో హైదరాబాద్ వ్యక్తి పేరును చేర్చలేదు. శుక్రవారం సాయంత్రం ప్రకటించిన కేంద్ర జాబితాలో గాంధీలో వ్యక్తిని చికిత్స తీసుకుంటున్న జాబితాలోనే ప్రకటించింది.

శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ను అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసులు 81 నమోదయ్యాయని, వారిలో కర్ణాటక వ్యక్తి సహా మరో మహిళ చనిపోయారని వెల్లడించింది. కాగా, కేరళలో ముగ్గురు వ్యక్తులు కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశామని, సఫ్దార్‌జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు వ్యక్తులు కోలుకున్నారని స్పష్టంగా పేర్కొంది.

కోలుకున్న ఆ ఏడుగురిని కూడా త్వరలోనే డిశ్చార్చి చేస్తామని పేర్కొన్న కేంద్రం తెలంగాణలో కరోనా పాజిటివ్ వ్యక్తి కోలుకున్నట్లుగా కానీ డిశ్చార్జి చేస్తామని కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ రాష్ట్రప్రభుత్వం మాత్రం కోలుకున్నాడని గురువారం ప్రకటించగా తాజాగా డిశ్చార్జి చేసినట్లుగా కూడా కొన్ని వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి.

మరి అసలు వాస్తవమేంటి అన్నది తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా విషయంలో కమాండింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదా? లేక కేంద్రమే తెలంగాణను పట్టించుకోవడం లేదా? అంటూ ప్రజలలో చర్చ జరుగుతుంది.

అసలే కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంలో అనేక అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. కారణాలేమైనా వైరస్ ను తెలంగాణ ప్రభుత్వం పెద్దగా పట్టించుకొవడం లేదని.. పూర్తిస్థాయి వాస్తవాలను కూడా బయటకు రానివ్వడం లేదని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఇలా కేంద్ర, రాష్ట్రాల మధ్య కొరవడిన సమన్వయం ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది.

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle