newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గత 18 నెలలుగా మాటల్లేవ్‌.. మళ్లీ పార్టీలోకి వస్తే పైలట్‌ని కౌగిలించుకుంటా.. గహ్లోత్‌

19-07-202019-07-2020 07:09:26 IST
Updated On 19-07-2020 11:03:28 ISTUpdated On 19-07-20202020-07-19T01:39:26.951Z19-07-2020 2020-07-19T01:39:24.590Z - 2020-07-19T05:33:28.889Z - 19-07-2020

గత 18 నెలలుగా మాటల్లేవ్‌.. మళ్లీ పార్టీలోకి వస్తే పైలట్‌ని కౌగిలించుకుంటా..  గహ్లోత్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గడిచిన 18 నెలలుగా రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌తో తనకు ఏ రకంగానూ మాటలు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గహ్లోత్‌ సంచలన విషయం చెప్పారు. ప్రభుత్వంలో చేరిన  మొదటి రోజు నుంచే తనను గద్దె దించేందుకు పైలట్‌ తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారని గహ్లోత్ ఆరోపించారు. అయినా సరే.. బీజేపీలో చేరడం లేదని చెబుతున్న పైలట్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి వస్తే ఆలింగనంతో ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని గహ్లోత్‌ చెప్పారు

నిజం చెబుతున్నాను. ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ గత ఏడాదిన్నర కాలం నుంచి మేం ఇద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ముఖ్యమంత్రితో కనీసంగా కూడా  మాట్లాడని మంత్రి సచిన్ పైలట్ అని గెహ్లోట్ వ్యాఖ్యానించారు.  తాను మొదటిసారి ఎంపీ అయినప్పటికి పైలట్‌ వయస్సు మూడేళ్లనీ, దశాబ్దాలుగా అతని కుటుంబంతో తనకు సంబంధాలు కొనసాగుతున్నాయనీ గెహ్లోట్ చెప్పారు. మళ్లీ పార్టీలోకి వస్తే అతడిని మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తా అని తెలిపారు.

గత ఏడాదిన్నర కాలంగా సచిన్ పైలట్ ఏ విషయాన్ని నాతో చర్చించేవాడు కాదు. నా సలహాలను స్వీకరించేవాడు కాదు. అలా ఏడాదిన్నరగా ఇద్దరి మధ్య మాటలే లేవు అని గహ్లోత్ వ్యాఖ్యానించారు. జూన్‌ 10వ తేదీనే పైలట్‌ అతని అనుచరులతో ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించారని కానీ ఆ కుట్రను ముందే గుర్తించి, కట్టడి చేశామన్నారు. అప్పటి కుట్రకు, తాజా కుట్రకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. పైలట్‌ మొదట్లో బీజేపీలో చేరాలని భావించారని, అతని అనుచరులు అంగీకరించకపోవడంతో కొత్తపార్టీని స్థాపించి, మూడోఫ్రంట్‌ ఏర్పాటుకు పైలట్‌ సిద్ధమయ్యారని చెప్పారు. 

గెహ్లోత్‌ గట్టెక్కినట్టే..!

యువనేత సచిన్‌ పైలట్‌ ఎమ్మెల్యేలను చీల్చి, సర్కారును పడగొట్టే ప్రయత్నాలు బెడిసి కొట్టాయని స్పష్టమైంది. గతవారం సచిన్‌ పైలట్‌ వర్గం ఢిల్లీలో శిబిరాన్ని ఏర్పాటు చేయగానే.. అప్పటిదాకా గెహ్లోత్‌ సర్కారుకు మద్దతునిచ్చిన బహుజన ట్రైబల్‌ పార్టీ(బీటీపీ) తమ ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. గెహ్లోత్‌ సర్కారు మైనారిటీలో పడిపోయింది. అయితే అనూహ్యంగా శనివారం ఆ పార్టీ మనసు మార్చుకుంది. తమ మద్దతు గెహ్లోత్‌కే అని ప్రకటించింది. బీటీపీ డిమాండ్లను నెరవేరుస్తానని గెహ్లోత్‌ హామీ ఇచ్చారు. 

దీంతో.. ఇప్పటిదాకా తన వెంట 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ వచ్చిన గెహ్లోత్‌.. తమ బలం మ్యాజిక్‌ ఫిగర్‌(101)ని దాటిందని ప్రకటించారు. శనివారం సాయంత్రం రాజస్థాన్‌ గవర్నర్‌ను కలిశారు. బీటీపీ ఎమ్మెల్యేల మద్దతు పత్రాలతోపాటు తన బలాన్ని పేర్కొంటూ గవర్నర్‌కు ఓ లేఖను అందజేశారు. ఈ పరిణామాలతో సచిన్‌ పైలట్‌ వర్గం ఆత్మరక్షణలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే పైలట్‌ సహా 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ చీఫ్‌విప్‌ అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌కు సమర్పించారు. దీనికి వ్యతిరేకంగా పైలట్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం ఉదయం కోర్టు విచారణ జరపనుంది. అయితే స్పీకర్‌ తన నిర్ణయాన్ని మంగళవారం సాయంత్రం వరకు వాయిదా వేయాలని కోర్టు సూచించడంతో.. ఆ తర్వాత పైలట్‌ వర్గం భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. 

గురు, శుక్రవారాల్లో రాజస్థాన్‌లో రెండు ఆడియో క్లిప్పుల రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అందులో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌.. ఎమ్మెల్యేల కొనుగోలుపై మాట్లాడారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అది తన గొంతు కాదంటూ షేకావత్‌ ప్రకటన చేశారు. రాజస్థాన్‌ సర్కారు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించారు. ఆడియో టేపుల వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. రెబల్‌ ఎమ్మెల్యేలు హరియాణాలోని ఓ రిసార్టులో ఉన్నారంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించింది. రాజస్థాన్‌ పోలీసుల తనిఖీల్లో ఎమ్మెల్యేలు ఎవరూ లేరని తేలిన విషయాన్ని గుర్తుచేసింది. 

ఈ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానాన్ని, గహ్లోత్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. నేతల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయా? ఒక వేళ జరిగితే, నిర్దేశిత నిబంధనల మేరకే చేశారా? తమ గుట్టు బయటపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిందా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ప్రశ్నించారు. రాష్ట్రంలోని గహ్లోత్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితర బీజేపీ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్‌ ఆడియో టేపులు విడుదల చేయడంపై బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్ర శనివారం స్పందించారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle