newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

క‌ర్ణాట‌క‌లో మ‌రో మ‌లుపు తిరిగిన రాజ‌కీయం..!

29-07-201929-07-2019 08:18:29 IST
Updated On 29-07-2019 08:38:26 ISTUpdated On 29-07-20192019-07-29T02:48:29.487Z29-07-2019 2019-07-29T02:48:25.003Z - 2019-07-29T03:08:26.579Z - 29-07-2019

క‌ర్ణాట‌క‌లో మ‌రో మ‌లుపు తిరిగిన రాజ‌కీయం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రో మ‌లుపు తిరిగింది. ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప బ‌ల‌ప‌రీక్ష‌కు ఒక రోజు ముందు స్పీక‌ర్ కేఆర్ రమేష్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్ కూట‌మి నుంచి రెబ‌ల్ ఎమ్మెల్యేలుగా మారి కుమార‌స్వామి విశ్వాస ప‌రీక్ష‌కు హాజ‌రుకాని 14 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్‌, ముగ్గురు జేడీఎప్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2023 వ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా వీరిపై వేటేశారు. మూడు రోజుల క్రితం కూడా ఆయ‌న ముగ్గురు రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ర‌మేష్ కుమార్‌ను స్పీక‌ర్ ప‌ద‌వి నుంచి త్వ‌ర‌లోనే బీజేపీ ప్ర‌భుత్వం దింపేసే అవ‌కాశం ఉంది. దీంతో ప‌ద‌వి నుంచి దిగిపోయే ముందే ఆయ‌న రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. అయితే, ఈ నిర్ణ‌యంతో య‌డియూర‌ప్ప‌కే మేలు జ‌ర‌గ‌నునంది. వేటు ప‌డ్డ‌ 17 మంది ఎమ్మెల్యేలు రేపు బ‌ల‌ప‌రీక్ష‌కు హాజ‌రుకారు. దీంతో స‌భ‌లో ఎమ్మెల్యేల సంఖ్య 207కు ప‌డిపోయింది. య‌డియూర‌ప్ప బ‌ల‌ప‌రీక్ష‌కు 104 స‌భ్యుల మ్యాజిక్ ఫిగ‌ర్ ఉంటే చాలు.

ప్ర‌స్తుతం బీజేపీకి 105 మంది స్వంత ఎమ్మెల్యేల బ‌లంతో పాటు మ‌రో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మ‌ద్ద‌తు కూడా ఉంది. దీంతో య‌డియూర‌ప్ప సులువుగా బ‌ల నిరూప‌ణ చేసుకోగ‌ల‌రు. అయితే, ఇద్ద‌రు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ ప్ర‌చారాన్ని బీజేపీ కొట్టి పారేస్తోంది తాము క‌చ్చితంగా బ‌లం నిరూపించుకుంటామ‌ని బీజేపీ నేత‌లు ధీమాగా ఉన్నారు.

వేటుకు ప‌డ్డ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టులో స‌వాల్ చేయ‌నున్నారు. ఒక‌వేళ సుప్రీం కోర్టు స్పీక‌ర్ నిర్ణ‌యంలో జోక్యం చేసుకోక‌పోతే ఆరు నెల‌ల్లో 17 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌నీసం ఎనిమిది సీట్లు గెలుచుకుంటేనే అధికారాన్ని కాపాడుకోగ‌ల‌రు. లేక‌పోతే అప్ప‌టి స‌భ్యుల సంఖ్య‌ను బ‌ట్టి మ్యాజిక్ ఫిగ‌ర్‌ను చేరుకునే అవ‌కాశం ఉండ‌దు.

దీంతో ఇప్ప‌టికిప్పుడు య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వానికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేక‌పోయినా ఆయ‌న స‌ర్కార్ అంత సేఫ్ మాత్రం కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, రెబ‌ల్ ఎమ్మెల్యేలపై వేటును బీజేపీ తీవ్రంగా త‌ప్పుప‌డుతోంది. స్పీక‌ర్ నిర్ణ‌యం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఇదో చీక‌టి రోజు అని బీజేపీ ఆరోపించింది. కాగా, రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై వేటును కాంగ్రెస్ స్వాగ‌తించింది. ప్ర‌జాస్వామ్యానికి ఇది నిజ‌మైన నిద‌ర్శ‌నమ‌ని, అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు గొడ్డ‌లిపెట్టు అని ఆ రాష్ట్ర సీఎల్పీ నేత సిద్ధ‌రామ‌య్య పేర్కొన్నారు.

మొత్తంగా 20 రోజులుగా రోజుకో మ‌లుపు తిరుగుతున్న క‌న్న‌డ రాజ‌కీయానికి రేప‌టితో శుభం కార్డు ప‌డుతుందా ? లేదా మ‌ళ్లీ క్లైమాక్స్‌లో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనే ఉత్కంఠ అంద‌రిలోనూ నెల‌కొంది. 

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

లెక్క తేలింది.. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 960 కోట్లు

   9 hours ago


కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం

   9 hours ago


‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

‘మహా’లో పట్టు నిలిచేనా? హర్యానాలో హవా సాగేనా?

   10 hours ago


టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

టీఆర్ఎస్‌లో తిరుగుబాటు.. కేసీఆర్ సర్కార్ పై నీలినీడలు

   10 hours ago


జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

జర్నలిస్టు హత్య కేసు:ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదా?

   11 hours ago


హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

హుజూర్‌నగర్లో హోరాహోరీ.. గెలుపెవరిది?

   11 hours ago


ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

ఆ విషయంలో జగన్ కంటే వైఎస్సే బెస్ట్.. బాబు కామెంట్స్

   13 hours ago


జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

జేసీ బ్రదర్స్‌ప్రై ప్రతీకారం మొదలైనట్లేనా..

   13 hours ago


దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

దేవుడు కూడా కేసీఆర్‌‌ను వ్యతిరేకిస్తున్నాడుగా.. దాసోజు ఎద్దేవా

   14 hours ago


ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   14 hours ago


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle