newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా వ్యాక్సిన్ కోసం అంద‌రి చూపు భార‌త్ వైపు

03-05-202003-05-2020 09:56:12 IST
Updated On 03-05-2020 10:41:59 ISTUpdated On 03-05-20202020-05-03T04:26:12.822Z03-05-2020 2020-05-03T04:24:03.018Z - 2020-05-03T05:11:59.875Z - 03-05-2020

క‌రోనా వ్యాక్సిన్ కోసం అంద‌రి చూపు భార‌త్ వైపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా మ‌హమ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. లాక్‌డౌన్ ద్వారా వైర‌స్ వ్యాప్తిని పూర్తిగా నివారించాల‌నే ప్ర‌య‌త్నాలు ఏ దేశంలోనూ పూర్తిగా స‌ఫ‌లం కావ‌డం లేదు. కేవ‌లం వైర‌స్ తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికే లాక్‌డౌన్ ప‌ని చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అంద‌రి ఆశ‌లూ వ్యాక్సిన్ త‌యారీపైనే ఉన్నాయి. అన్ని దేశాలూ వ్యాక్సిన్ కోస‌మే ఎదురుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు క‌రోనా స‌మ‌స్య త‌ప్ప‌ద‌ని ఒక అభిప్రాయానికి వ‌చ్చేశాయి. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ త‌యారీ కోసం భార‌త్‌లోని ఓ సంస్థ‌పై ఇప్పుడు అన్ని దేశాలు ప్ర‌త్యేక దృష్టి పెట్టాయి.

మ‌హారాష్ట్ర‌లోని పూణేలో ఉంటుంది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. 1966లో సైర‌స్ పూణావాలా ప్రారంభించిన ఒక ప్రైవేటు లిమిడెడ్ కంపెనీ ఇది. అన‌తికాలంలోనే ఈ సంస్థ‌తో ఎంతో వృద్ధి సాధించింది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్‌(డోస్‌ల సంఖ్య ప‌రంగా) ఉత్ప‌త్తి, ఎగుమ‌తిదారుగా ఈ సంస్థ నిలిచింది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌తో, సంస్థ‌ల‌తో క‌లిసి మాన‌వాళికి స‌వాల్ విసురుతున్న వైర‌స్‌లు, రోగాల‌కు ఔష‌దాల‌ను క‌నిపెట్టేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్‌కు కూడా విరుగుడుగా వ్యాక్సిన్ క‌నిపెట్టడంలో సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ కీల‌కంగా మారింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభివృద్ధి చెందిన‌, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క‌రోనా వ్యాక్సిన్ త‌యారీకి సుమారు 100 సంస్థ‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి. వీటిల్లో కేవ‌లం 5 మాత్రమే ట్ర‌య‌ల్స్ మొద‌లుపెట్టే దిశ‌లో ఉన్నాయి.

వీటిల్లోనూ ముందున్నారు యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్రవేత్త‌లు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలోని జెన్న‌ర్ ఇన్‌స్టిట్యూట్‌కి ప్రొ.అడ్రైన్ హిల్ డైరెక్ట‌ర్‌. ఈ సంస్థ దీర్ఘ‌కాలంలో మాన‌వాళిని వేధిస్తున్న ఎయిడ్స్‌, మ‌లేరియా, టీబీ వంటి వాటికి వ్యాక్సిన్‌ల త‌యారీకి కృషి చేసింది. ఇప్పుడు అడ్రైన్ హిల్ నేతృత్వంలోనే ఓ ప‌రిశోధ‌న బృందం క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేసే ప‌నిలో ఉంది. కాగా, సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ ప‌రిశోధ‌న‌ల్లో కీల‌కంగా ఉంది. రెండు సంస్థ‌లు సంయుక్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నాయి.

ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ను కోతుల‌పై ప్ర‌యోగించారు. అవి ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిపై వ్యాక్సిన్ బాగా ప‌ని చేసింది. త్వ‌ర‌లోనే మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు జ‌ర‌ప‌నున్నారు. క‌రోనా వైర‌స్‌కు విరుగుడుగా ఈ వ్యాక్సిన్ ప‌ని చేస్తోందా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా వంటి వాటిని నిర్ధారించుకుంటారు. ఈ ప్ర‌యోగాలు విఫ‌ల‌మై, అంత‌ర్జాతీయ స్థాయిలో వివిధ అనుమ‌తులు పొందితే వ్యాక్సిన్ త‌యారీ దిశ‌కు వెళుతుంది.

ఈ వ్యాక్సిన్ త‌యారు చేసేది సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్‌. వ్యాక్సిన్ ప్ర‌యోగాలు క‌చ్చితంగా విజ‌య‌వంత‌మ‌వుతాయ‌ని న‌మ్మ‌కంగా ఉన్న ఈ సంస్థ ఇప్ప‌టికే వ్యాక్సిన్ల త‌యారీకి సిద్ధ‌మ‌వుతోంది.

సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌రు నాటికి ప‌రిశోధ‌న‌లు పూర్త‌వుతాయ‌ని ఈ సంస్థ అంచ‌నా వేస్తోంది. ఒక‌సారి అనుమ‌తి రాగానే మొద‌టి నెల‌నే 50 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ త‌యారు చేయాలని ఈ సంస్థ ల‌క్ష్యంగా. త‌ర్వాత నెల‌కు కోటి వ్యాక్సిన్‌ల‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని సంక‌ల్పించింది.

ఇందుకోసం రానున్న ఐదు నెల‌ల్లో రూ.30 - 40 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాట్లు ఈ సంస్థ చెబుతోంది. కేంద్ర ప్ర‌భుత్వం కూడా త‌మ‌కు స‌హ‌క‌రిస్తోంద‌ని, ప్ర‌ధాని కార్యాల‌యం ఈ ప‌రిశోధ‌న‌ల తీరును ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటోంద‌ని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అద‌ర్ పూణావాలా చెబుతున్నారు.

కాగా, ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి మొద‌లైతే మొద‌టి ద‌శ‌లోనే భార‌తీయుల‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. అంతేకాదు, అంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌లో సుమారు రూ.1000కి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలనే ఆలోచ‌న‌తో ఈ సంస్థ ఉన్న‌ట్లు ఆయ‌న చెబుతున్నారు.

ఈ వ్యాక్సిన్‌కు ఎటువంటి పేటెంట్ కూడా తీసుకునే ఉద్దేశ్యం త‌మ‌కు లేద‌ని, ప్ర‌పంచం మొత్తం వీలైనంత వేగంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల‌నే ఆలోచ‌న త‌మ‌ద‌ని అంటున్నారు. వ్యాక్సిన్ త‌యారీలో ఆక్స్‌ఫ‌ర్డ్ - సీర‌మ్ సంస్థ ముందడుగుతో ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం ఈ ప‌రిశోధ‌న‌పైనే ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి.      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle