newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా వైర‌స్‌పై కేర‌ళ‌ను గెలిపిస్తున్న 'శైల‌జ' టీచర్

17-09-202017-09-2020 09:06:28 IST
2020-09-17T03:36:28.372Z17-09-2020 2020-09-17T03:36:16.121Z - - 15-04-2021

క‌రోనా వైర‌స్‌పై కేర‌ళ‌ను గెలిపిస్తున్న 'శైల‌జ' టీచర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మ‌హిళ‌లు అధినేత‌లుగా ఉన్న దేశాలు క‌రోనా వైర‌స్‌ను జ‌యించ‌డంలో ముందున్నాయ‌నే సంగ‌తి తెలిసిందే. న్యూజి‌ల్యాండ్‌, జ‌ర్మ‌నీ వంటి దేశాల‌ను న‌డిపిస్తున్న మ‌హిళా నేత‌లు ఆయా దేశాల్లో క‌రోనా వైర‌స్‌ను స‌మ‌ర్థంగా ఎదురుకుంటున్నారు. ఇందుకు మ‌రో చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ మ‌న దేశంలోని కేర‌ళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైల‌జ‌. మ‌న దేశంలోనే మొద‌టి క‌రోనా వైర‌స్ కేసు కేర‌ళ‌లో న‌మోదైంది. మిగ‌తా రాష్ట్రాల కంటే ముందే కేర‌ళ‌లో క‌రోనా ప్ర‌భావం మొద‌లైంది. అయితే, క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేర‌ళ విజ‌య‌వంత‌మ‌వుతోంది. ఆ రాష్ట్రంలో న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య‌ను, మ‌ర‌ణాల రేటును ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది.

మిగ‌తా రాష్ట్రాల కంటే కేర‌ళ‌లో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంది. మ‌ర‌ణాల రేటు కూడా చాలా త‌క్కువ ఉంది. కేసుల సంఖ్య కూడా మ‌రీ ఎక్కువ‌గా లేదు. ఇలా అన్ని అంశాల్లోనూ క‌రోనాను ఎదుర్కోవ‌డంలో మిగ‌తా రాష్ట్రాల కంటే కేర‌ళ మెరుగ్గా ఉంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కేకే శైల‌జ. క‌రోనా మొద‌లైన నాటి నుంచి ఆమె అవిశ్రాంతంగా ప‌ని చేస్తున్నారు. ఎంతలా అంటే క‌రోనా ప్రారంభ‌మైన త‌ర్వాత ఆమె త‌న కుటుంబాన్ని కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే క‌లిశారంటే ఆమె ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఆమెకు ప్రఖ్యాత బ్రిట‌న్ మ్యాగ‌జైన్ ప్రాస్పెక్ట్ నిర్వ‌హించిన పోటీలో 2020లో అత్యుత్త‌మ ఆలోచ‌నాప‌రుల జాబితాలో కేకే శైల‌జ మొద‌టిస్థానంలో నిలిచారు.

కేర‌ళ‌లోని క‌న్నూర్ జిల్లాకు చెందిన 63 ఏళ్ల శైల‌జ బీఎస్సీ చ‌దివిన అనంత‌రం బీఈడీ చేశారు. దీంతో ఆమె ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలిగా ప‌ని చేశారు. ఏడేళ్ల పాటు ప‌ని చేసిన త‌ర్వాత ఆమె వాలంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకొని రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘ‌మైన ఎస్ఎఫ్ఐకి ముందునుంచీ ఆమె సానుభూతిప‌రురాలిగా ఉండేవారు. దీంతో ఆమె రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాక సీపీఎం పార్టీని ఎంచుకున్నారు. పార్టీలో త‌క్కువ కాలంలోని మంచి గుర్తింపు ల‌భించ‌డంతో 1996 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.

2006లో ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2016లో పిన‌ర‌యి విజ‌య‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక త‌న క్యాబినెట్‌లోకి తీసుకున్న ఇద్ద‌రు మంత్రుల్లో శైల‌జ ఒక‌రు. ఆమెకు వైద్యారోగ్య శాఖ‌ను కేటాయించారు. ఆమె మంత్రి అయ్యాక కొంత‌కాలానికి కేర‌ళలో నిఫా వైర‌స్ వ్యాప్తి మొద‌లైంది. మ‌న దేశంలో ఈ వైర‌స్ ప్ర‌భావం కేర‌ళ‌లో మాత్ర‌మే చూపించింది. కొత్త వైర‌స్ అయినా కేకే శైల‌జ త‌న ఆలోచ‌న‌లతో వైద్యారోగ్య శాఖ‌ను స‌మ‌ర్థంగా న‌డిపించింది. దీంతో నిఫా వైరస్‌ను కేర‌ళ జ‌యించింది. అప్పుడే శైల‌జ‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ఏ విష‌యంపైన అయినా శాస్త్రీయంగా ఆలోచించే శైల‌జ నిఫా వైర‌స్ వ్యాపించిన‌ప్పుడు ధైర్యంగా ప‌ని చేశారు. ఆ వైర‌స్ కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల‌ను ఆమె నేరుగా సంద‌ర్శించి ప్ర‌జ‌ల్లో ఉన్న భ‌యాన్ని పోగొట్టారు. నిఫా వైర‌స్‌ను కేర‌ళ స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డంలో శైల‌జ కృషి చాలా ఉంది. నిఫా వైర‌స్‌పై పోరాడిన అనుభ‌వంతోనే ఇప్పుడు ఆమె క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డంలోనూ విజ‌య‌వంత‌మ‌వుతున్నారు. క‌రోనా వైర‌స్ అనేది కేవ‌లం చైనాకే ప‌రిమిత‌మైంది అనుకునే జ‌న‌వ‌రిలోనే కేర‌ళ‌లో క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో ఆమె వెంట‌నే రంగంలోకి దిగి వైద్య సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. టెస్ట్‌, ట్రేస్‌, ఐసొలేట్ అనే విధానాన్ని మొద‌టి నుంచి ఆమె క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. కేర‌ళ ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తం చేశారు. వారిలో అవ‌గాహ‌న క‌ల్పించారు. దీంతో కేర‌ళ‌లో క‌రోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో మొద‌టి కేసు న‌మోదైనా ఇప్పుడు కేర‌ళ క‌రోనా కేసుల్లో 13వ స్థానంలో ఉంది. 1.18 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదైనా మ‌ర‌ణాల సంఖ్య మాత్రం 500 లోపే ఉంది. ఇలా అన్ని ర‌కాలుగా క‌రోనా వైర‌స్‌ను కేర‌ళ విజ‌య‌వంతంగా ఎదుర్కొంటుంది. ఇందులో కేకే శైల‌జ కృషి ఎక్కువ‌గా ఉంది. కాగా, ఆరోగ్య‌శాఖ మంత్రిగా ఉన్నా కేకే శైల‌జ‌ను కేర‌ళ ప్ర‌జ‌లు శైల‌జ టీచ‌ర్ అని పిలుచుకుంటారు. ఆమె గ‌తంలో టీచ‌ర్‌గా ప‌ని చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle