కమలం వర్సెస్ కమల్ నాథ్
04-05-201904-05-2019 07:53:44 IST
Updated On 02-07-2019 11:58:18 ISTUpdated On 02-07-20192019-05-04T02:23:44.843Z04-05-2019 2019-05-04T02:23:22.683Z - 2019-07-02T06:28:18.344Z - 02-07-2019

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కమలం వర్సెస్ కమల్ నాథ్ అన్న రీతిలో రాజకీయం నడుస్తోందట. ఈ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీలైనన్ని సీట్లు గెల్చుకునేందుకు కష్టపడుతోందట. అందుకే ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట రాహుల్ గాంధీ. దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింథియా వర్గాలు ఎన్ని మెలికలు పెట్టినా కమల్ నాథ్ మీదే రాహుల్ గాంధీ ఆశలు పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల వేళ కమల్ నాథ్ బంధువుల ఇళ్ల మీద ఐటీ దాడులు జరిగాయి. ఇవన్నీ రాజకీయ వైరంతోనే బీజేపీ చేయించింది అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. అలాగే బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమల్ నాథ్, రైతులను తనవైపు తిప్పుకునేందుకు రైతు రుణమాఫీ మీద సంతకం చేశారు. అలాగే ఓబీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రస్తుతం వారికి ఉన్న 14 శాతం రిజర్వేషన్లను 27 శాతానికి పెంచారు. రాష్ట్ర జనంలో 45 శాతం ఓబీసీలే ఉండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 29 సీట్లలో 26 బీజేపీ, 3 కాంగ్రెస్ పార్టీ గెల్చుకున్నాయి. 2009 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 10 సీట్లు ఎక్కువగా గెల్చుకుంటే, కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు కోల్పోయింది. అందుకే ఈసారి కాంగ్రెస్ పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొత్తం 29 సీట్లలో కనీసం రెండంకెల స్థానాలను గెల్చుకోడానికి కష్టపడుతున్నారట. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జనం, ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నారట. అందుకే 2014లో మాదిరిగా 26 సీట్లు రాకపోయినా, కనీసం 20 సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.

నా రూటే సెపరేటు
13 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
21 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా