newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న కర్నాటక ఎపిసోడ్

10-07-201910-07-2019 17:06:01 IST
Updated On 11-07-2019 11:40:29 ISTUpdated On 11-07-20192019-07-10T11:36:01.935Z10-07-2019 2019-07-10T11:35:59.836Z - 2019-07-11T06:10:29.982Z - 11-07-2019

క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న కర్నాటక ఎపిసోడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక సంక్షోభం అటు కర్నాటకతో పాటు ముంబై, గోవా, ఢిల్లీలోనూ ప్రకంపనలు కలిగిస్తోంది. తాజాగా కర్ణాటక రాజకీయ గందరగోళం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆమోదించకపోవడంతో.. కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. కాగా ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం విచారిస్తామని తెలిపారు.

అయితే కర్ణాటకకు చెందిన 14మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలు సమర్పించగా.. వాటిలో ఐదు మాత్రమే ఫార్మట్ ప్రకారం ఉన్నాయని స్పీకర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాజ్యాంగ విధులను స్పీకర్ సక్రమంగా నిర్వహించడం లేదని వారు విమర్శిస్తున్నారు.

224 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే సభ్యుల సంఖ్య 211 కి తగ్గిపోతుంది. దీంతో ప్రభుత్వానికి 106 మంది సభ్యుల మెజారిటీ అవసరం అవుతుంది. ప్రభుత్వం మెజారిటీ కోల్పోతుందనే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈమేరకు యడ్యూరప్ప గవర్నర్ ని కలిసి కుమారస్వామి సీఎంగా కొనసాగే హక్కు కోల్పోయారని, ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు వినతిపత్రం అందచేశారు,

ఇదిలా ఉంటే ముంబైలోని రినైజెన్స్ ముంబై కన్వెన్షన్ సెంటర్లో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలను కలుసుకోవడానికి వెళ్ళిన మంత్రి డీకె శివకుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. వారిని కలవకుండా తాను వెనక్కి తిరిగి వెళ్ళనని శివకుమార్ పట్టుబట్టారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం ఒక మంత్రిని హోటల్లోకి వెళ్ళకుండా ఆపే సంప్రదాయం కాదని పోలీసుల తీరుని తప్పుబట్టారు. బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఇతర కాంగ్రెస్ నేతలు గవర్నర్ నివాసం ముందు నిరసన తెలిపారు. 

మహారాష్ట్రలో హోటల్ బయట వేచిఉన్న కర్నాటక మంత్రి డీకె శివకుమార్‌ని కాంగ్రెస్ నేత మిళింద్ దేవ్ రా కలుసుకుని హోటల్ నుంచి కలినా యూనివర్శిటీ రెస్ట్ హౌస్ కి తీసికెళ్ళారు. పార్లమెంటులో టీఎంసీ, కాంగ్రెస్, ఇతర విపక్షాలు బీజేపీ తీరుపై లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. హార్స్ ట్రేడింగ్ పై మండిపడ్డాయి. రాహుల్ గాంధీ సైతం కాంగ్రెస్ సభ్యులకు వంత పాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబై పోలీసుల తీరుని కాంగ్రెస్ ప్రతినిధి సంజయ్ నిరుపమ్ దుయ్యబట్టారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle