newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్ లెక్కలు సరైనవేనా.. వాస్తవాలను దాస్తే భారీ మూల్యం తప్పదు.. రాహుల్ ధ్వజం

20-07-202020-07-2020 15:39:08 IST
Updated On 20-07-2020 17:21:59 ISTUpdated On 20-07-20202020-07-20T10:09:08.973Z20-07-2020 2020-07-20T10:09:04.946Z - 2020-07-20T11:51:59.005Z - 20-07-2020

కోవిడ్ లెక్కలు సరైనవేనా.. వాస్తవాలను దాస్తే భారీ మూల్యం తప్పదు.. రాహుల్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తన వైఫల్యాన్ని దాచి ఉంచడానికి సంస్థాగతంగానే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కరోనా కట్టడి విషయంలో సాగుతున్న ఈ అబద్దాలు ఇలాగే కొనసాగితే దేశం బారీమూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాహుల్ హెచ్చరించారు. కరోనా విషయంలోనే కాకుండా జీడీపీ, చైనాతో ప్రతిష్టంభన వంటి అంశాలపై కూడా కేంద్రప్రభుత్వం అసత్యాల మీద అసత్యాలకు పాల్పడుతోదని విమర్శించారు.

కరోనా మహమ్మారిపై పాలక బీజేపీ వాస్తవాలను దాచి అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కరోనా మరణాలు, జీడీపీ, చైనాతో ప్రతిష్టంభన వంటి అంశాలపై బీజేపీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందని దుయ్యబట్టారు. టెస్టింగ్‌లను తగ్గిస్తూ, మరణాలపై తప్పుడు వివరాలను ఇస్తున్నారని, నూతన పద్ధతిలో జీడీపీని లెక్కిస్తున్నారని కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. చైనా దూకుడుపైనా ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. కీలకాంశాలపై పాలకులు భ్రమల్లో విహరిస్తే భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో మొత్తం కేసుల శాతం, పదిలక్షల మందిలో మరణాల సంఖ్య తక్కువగా ఉండటంపై సందేహం వ్యక్తం చేసిన ఓ వెబ్‌సైట్‌ కథనాన్ని రాహుల్‌ తన ట్వీట్‌తో పాటు పోస్ట్‌ చేశారు. చైనాతో సరిహద్దు వివాదంలోనూ భారత్‌ తీరు సరిగ్గాలేదని, దీనికి భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కోవిడ్‌-19, లడఖ్‌ ప్రతిష్టంభన, వలస కార్మికుల దుస్ధితి, ఆర్థిక సంక్షోభం సహా పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వంపై గత కొద్దివారాలుగా రాహుల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఈ సందర్భంగా వాషింగ్టన్ పోస్టులో భారతదేశంలోని కరోనా లెక్కలపై వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇండియాలో పది లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి కానీ కరోనా రోగుల మరణాల సంఖ్యలో ఏదో మాయ జరుగుతోంది అని వాషింగ్టన్ పోస్టు కథనం ప్రచురించింది. కేంద్రప్రభుత్వంపై విరామం లేకుండా విమర్శల దాడి కొనసాగిస్తున్న రాహుల్ కోవిడ్-19 సాంక్రమిక వ్యాధి వ్యాపించిన తర్వాత కొన్ని నెలలుగా ప్రతిరోజూ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూండటం తెలిసిందే.

కరోనా వ్యాధిపై పోరాటంలో భారత్ మంచి స్థానంలో ఉంటోందని గత వారం కేంద్ర హోమంత్రి అమిత్ షా చెప్పారని, రోజులలోపే భారత్ పది లక్షల కరోనా రోగుల కేసులను దాటేసిందని ఈ మంగళవారానికి 11 లక్షల కేసు కూడా నమోదు కానుందని రాహుల్ విమర్శించారు.

ఈరోజు దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంటోంది. ఇక విదేశాంగ విధానానికి అర్థం పర్థం లేకుండా పోయింది, పోరుగుదేశాలన్నీ భారత్ పట్ల విరోధభావంతో ఉంటున్నాయి. అందుకే ఇదే మంచి తరుణమని భావించిన చైనా లడాక్‌లో దుస్సాహసిక దాడికి పాల్పడిందని రాహుల్ పేర్కొన్నారు. 

అయితే దేశంలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న కరోనా రోగుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలోనే పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కూడా ప్రకటించింది. భారత్‌లో కరోనా మరణాల రేటు క్రమంగా దిగివస్తూ ప్రస్తుతం 2.49 శాతానికి పడిపోయిందని, ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేట్లలో ఒకటని తెలిపింది. ప్రభుత్వాల చొరవతో కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 2.5 శాతం దిగువకు పడిపోయిందని తెలిపింది. రిస్క్‌ అధికంగా ఉన్న వ్యక్తులపై నిరంతర పరిశీలనతో పాటు వ్యాధిని ముందే గుర్తించగలిగి చికిత్స అందించడంతో మరణాల రేటు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle