newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోవిడ్ నిబంధనలు పక్కా.... స్కూళ్ళు, కాలేజీల రీ ఓపెనింగ్ మార్గదర్శకాలివే

09-09-202009-09-2020 08:48:20 IST
Updated On 09-09-2020 09:36:30 ISTUpdated On 09-09-20202020-09-09T03:18:20.611Z09-09-2020 2020-09-09T03:18:16.599Z - 2020-09-09T04:06:30.382Z - 09-09-2020

కోవిడ్ నిబంధనలు పక్కా.... స్కూళ్ళు, కాలేజీల రీ ఓపెనింగ్ మార్గదర్శకాలివే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ప్రారంభమయిన లాక్ డౌన్ ద్వారా విద్యాలయాలు మూసివేశారు. దేశంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. రోజూ 90 వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. అన్ లాక్ నిబంధనల్లో భాగంగా మళ్లీ విద్యాలయాలు గంటలు మోగనున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉన్నత విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పాఠశాలల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ వేర్వేరు మార్గదర్శకాలు జారీ చేసింది.

తరగతులు ప్రారంభమయ్యే ఈ నెల 21వ తేదీ నాటికి విద్యాలయాల ప్రాంగణంలో అడుగడుగునా పరిశుభ్రత పాటించేలా, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన అన్ని ప్రామాణిక నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు స్వచ్ఛందంగా వచ్చి ఉపాధ్యాయుల వద్ద సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్న 9-12వ తరగతి విద్యార్థులకుగాను ప్రత్యేక సూచనలను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి తల్లిదండ్రుల అనుమతితో ఆయా తరగతుల విద్యార్థులు పాఠశాలలకు రావడానికి కేంద్రం అనుమతించింది. తరగతి గదుల నిర్వహణ, రవాణా సదుపాయాలతో పాటు పాఠశాలల్లో పాటించాల్సిన అన్ని జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య భౌతిక దూరం పాటించాలని తెలిపింది.

కంటైన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న పాఠశాలల్ని తెరవొచ్చు. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలల్లోకి అనుమతి లేదు. కంటైన్‌మెంట్‌ జోన్లలోకి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వెళ్ల కూడదు. పాఠశాలల్లోని ప్రయోగశాలలు, ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేయాలి. క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించిన పాఠశాలలను తప్పని సరిగా నిబంధనల ప్రకారం శానిటైజ్‌ చేయాలి.

ఉపాధ్యాయులు, సిబ్బంది 50శాతం మంది హాజరయ్యేలా చూడాలి. 9-12 విద్యార్థులకు భౌతికంగా లేదా వర్చువల్‌ తరగతులకు హాజరయ్యే అవకాశం ఇవ్వాలి. భౌతికంగా హాజరయ్యే విద్యార్థులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. బయో మెట్రిక్‌ హాజరు పద్దతి అవసరం లేదు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీలుంటే ఆరు బయట కూర్చొనేలా చూడాలి. ప్రాంగణంలో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనే ఏర్పాట్లు ఉండాలి. ‘క్యూ’ పద్ధతి పాటించే విషయంలో ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్‌ చేయాలి. సమావేశాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు సహా ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలపై నిషేధం విధించారు. 

ప్రతి పాఠశాలలోనూ రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబరు, స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్‌ నంబర్లు ప్రదర్శించాలి. అవసరమయితే వారి సహాయం తీసుకునే అవకాశం వుండాలి. పాఠశాలల ప్రారంభం అనంతరం విద్యార్థుల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. వాటి వద్ద పరిశుభ్రత పాటించాలి. థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతించాలి. సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.

విద్యార్థులు కూర్చొనే చోట ఒక్కొక్కరి మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి. తరగతి జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కు ధరించే ఉండాలి. నోట్‌బుక్‌, పెన్నులు, పెన్సిళ్లు, మంచినీరు బాటిళ్లు తదితర వస్తువులు ఏవీ కూడా ఇతర విద్యార్థులతో పంచుకోకుండా చూడాలి. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   17 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   20 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   12 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   14 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle