newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోల్ కతాలో 300 మంది నర్సుల రాజీనామా.. ఎందుకంటే?

17-05-202017-05-2020 18:48:40 IST
Updated On 18-05-2020 09:12:48 ISTUpdated On 18-05-20202020-05-17T13:18:40.562Z17-05-2020 2020-05-17T13:17:51.005Z - 2020-05-18T03:42:48.058Z - 18-05-2020

కోల్ కతాలో 300 మంది నర్సుల రాజీనామా.. ఎందుకంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిద్‌-19 కేసులతో కోల్‌కతా, హౌరాలు పోరాడుతున్నవేళ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది నర్సులు తమ ఉద్యోగాలకు స్వస్తిపలికారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వందలాదిమంది నర్సులు సామూహికంగా రాజీనామాలు చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ప్రైవేటు ఆసుపత్రులు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నర్సులు ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 300 మంది నర్సులు తమ ఉద్యోగాలను వదులుకుని తమ సొంతూళ్ళకు వెళ్ళిపోవడంతో కోవిడ్ 19 రోగులకు సేవలు అందించడం కష్టంగా మారింది. 

ఈ సమస్యను పరిష్కరించాలని అసోసియేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా (ఏహెచ్ఈఐ) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు లేఖ రాసింది. సొంతూళ్ళకు వెళ్లిన నర్సుల్లో మణిపూర్‌వాసులు ఎక్కువ మంది ఉన్నారు. త్రిపుర, ఒడిశా, జార్ఖండ్‌లకు చెందినవారు కూడా తమ స్వరాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఏహెచ్ఈఐ ప్రెసిడెంట్ ప్రదీప్ లాల్ మెహతా మాట్లాడుతూ నర్సులు తమ సొంతూళ్ళకు వెళ్ళిపోవడానికి కచ్చితమైన కారణాలేమిటో తెలియదన్నారు.

అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నర్సులను అడిగినపుడు తెలిసిన సమాచారం ప్రకారం, మణిపూర్ ప్రభుత్వం ఆకర్షణీయమైన వేతనం చెల్లిస్తామని ప్రకటించడంతో, నర్సులు తమ స్వంతూళ్ళు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నర్సుల రాజీనామా వ్యవహారంపై మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్  ఫేస్‌బుక్ ద్వారా స్పందించారు. తమ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని నర్సులు తిరిగి రావాలనే ప్రకటన చేయలేదన్నారు.

కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో రోగులకు సేవ చేస్తున్న తమ రాష్ట్ర నర్సులు తమకు గర్వకారణమని అయితే  ఈసంక్షోభం వేళ నర్సులు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగింది కాదన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2576 చేరాయి. 232 మంది మరణించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరణాల రేటు పెరగడం ఆందోళనకరంగా మారింది. 

 

 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   23 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   a day ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle