కోమాలోనే ప్రణబ్.. కిడ్నీల పనితీరు ఆశాజనకం
29-08-202029-08-2020 18:59:50 IST
Updated On 29-08-2020 20:36:53 ISTUpdated On 29-08-20202020-08-29T13:29:50.852Z29-08-2020 2020-08-29T13:29:30.554Z - 2020-08-29T15:06:53.034Z - 29-08-2020

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోవిడ్ బారిన పడి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన కోమాలోనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్ రిఫెరల్ ఆస్పత్రి తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రణబ్ డీప్ కోమాలోనే ఉన్నప్పటికీ గతంలో కంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్ రేటు స్థిరంగా, సాధారణంగా ఉంది. గతంలో కంటే కిడ్నీల పనితీరు కూడా కొద్దిమేర మెరుగైందని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావటంతో ఆగస్టు 10 న సర్జరీ నిర్వహించారు. సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం మరింత దిగజారింది. అప్పటి నుండి ఆయన కోమాలోనే ఉన్నారు. అయితే అప్పటికే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయనను అత్యవసర వైద్య సేవల విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం కంటికిరెప్పలా కాపాడుతోంది. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ యోధుడిలా బయటకు వస్తారని రాజకీయ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బ్రెయిన్ సర్జరీ తో పాటు కరోనా వైరస్ సోకటం వల్ల అది ఆయన ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తోంది ప్రణబ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ నాయకులతో పాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
13 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
18 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
19 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
21 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
a day ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
14 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
16 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
a day ago
ఇంకా