newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోట్లకు పడగలెత్తాడు.. అసెంబ్లీ పోరులో గెలిచాడు

24-10-201924-10-2019 14:08:23 IST
2019-10-24T08:38:23.713Z24-10-2019 2019-10-24T08:38:21.707Z - - 11-04-2021

కోట్లకు పడగలెత్తాడు.. అసెంబ్లీ పోరులో గెలిచాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పరాగ్ షా.. ఈ పేరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అందరు అభ్యర్దుల కంటే ఈయనే బాగా సంపన్నుడు. మహారాష్ట్రలోని ఘట్కోపర్ ఈస్ట్ అసెంబ్లీ సీటునుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు అక్షరాలా రూ.500.62 కోట్లు. ఈయన ప్రస్తుతం ఘట్కోపర్ కార్పోరేటర్ గా ఉన్నారు. 

50 ఏళ్ళ ఈ ఆగర్భ శ్రీమంతుడికి ఎప్పటినుంచో ఎమ్మెల్యే కావాలని మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉందిట. దీంతో బీజేపీ నుంచి సీటు సంపాదించాడు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్లో రూ 422 కోట్ల చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. వీటితో పాటు భార్య పేరిట కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి.

రాజకీయాల్లో సంపన్నుల హవా ఎలా ఉందో చెప్పడానికి పరాగ్ షా కి మించిన నిదర్శనం లేదనే చెప్పాలి. బీజేపీ ముంబై అధ్యక్షుడు మంగళ్ ప్రభాత్ లోధా కంటే ఈయనే సంపన్నుడు. లోదా మలబార్ హిల్ నుంచి పోటీచేశారు. ఆయన ఆస్తి రూ 441 కోట్లు, ఎస్పీ నుంచి పోటీచేసిన అబు అజ్మీ తన ఆస్తుల్ని రూ 220 కోట్లుగా పేర్కొన్నారు. పరాగ్ షా రియల్ ఎస్టేట్ వ్యాపారి.

ఆయనకు గుజరాత్, చెన్నైలో వెంచర్లు ఉన్నాయి. 2017లో బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసినప్పుడు తన ఆస్తి రూ.690 కోట్లుగా చూపించాడు. బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసిన అత్యంత సంపన్నుడిగా అప్పుడే పేరు తెచ్చుకున్నారు. ఈయన గుజరాతీ జైన్ వర్గానికి చెందినవారు. ఆయనకు 2.6 కోట్ల రూపాయల విలువైన బంగారం, రెండుకార్లున్నాయని తెలిపారు. హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాగ్ షా సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మనీషా సంపత్ రావ్ సూర్యవంశ్ పై గెలిచారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   13 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   9 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   11 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   16 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle