కొరివితో తలగోక్కున్న శశిథరూర్
09-05-201909-05-2019 08:30:52 IST
Updated On 01-07-2019 11:51:16 ISTUpdated On 01-07-20192019-05-09T03:00:52.783Z09-05-2019 2019-05-09T03:00:45.366Z - 2019-07-01T06:21:16.004Z - 01-07-2019

రాజకీయాల్లో శత్రువులు ఎక్కడో ఉండరు, పక్కనే ఉంటారట. ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలీదు కానీ, అమాయకంగా, మితిమీరిన తెలివితో మాట్లాడే నేతలు, సొంత పార్టీనే ఇరకాటంలో పెట్టేస్తారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అందరికంటే ముందున్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన కామెంట్లు, ఆ పార్టీకి చుక్కలు చూపించాయి. ఆ ఎన్నికల్లో మోడీ విజయానికి అవి కూడా ఓ కారణం అయ్యాయి. ఈ ఎన్నికల సమయంలో కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా నోరు జారేశారు. కర్ణాటకలో టిప్పుసుల్తాన్ మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. తాజాగా టిప్పు సుల్తాన్ చరిత్ర, ఆయన వర్థంతిని ఘనంగా ఎలా జరపాలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బాగా తెల్సంటూ శశిథరూర్ కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు బీజేపీకి లడ్డూలా దొరికాయట. థరూర్ కామెంట్ మీద మండిపడ్డ బీజేపీ, మన సైనికుల మీద నమ్మకం లేని ఆయనకు, పాకిస్తాన్ ప్రధాని మీద చాలా ప్రేమ, నమ్మకం ఉన్నాయంటూ ఎదురు దాడి మొదలు పెట్టారు. దీంతో కంగుతినడం కాంగ్రెస్ పార్టీ వంతు అయింది. ఓవైపు హిందీ రాష్ట్రాల్లోని కీలక స్థానాల్లో ఎన్నికలు జరిగే సమయంలో ఇదెక్కడి గోలంటూ ఆ ప్రాంతాల కాంగ్రెస్ అభ్యర్ధులు తలలుపట్టుకుంటున్నారట. ఓవైపు సునందా పుష్కర్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశిథరూర్, ఈ కామెంట్లు చేయడంపై జనం మండిపడుతున్నారట. మొత్తానికి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద వేయడానికి బీజేపీకి ఓ అస్త్రాన్ని ఉచితంగా అందించారు శశిథరూర్. తాను చేసిన తప్పు సరిదిద్దుకునే లోపే, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న ఫీలింగులో ఇప్పుడు ఆయన ఉన్నారట.

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
30 minutes ago

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
23 minutes ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్
an hour ago

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!
2 hours ago

తిరుపతిలో కొనసాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్
5 hours ago

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెపరేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేనట్లే
3 hours ago

సభ్య సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అక్కా
6 hours ago

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
20 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
21 hours ago
ఇంకా