కొన్ని సడలింపులతో లాక్ డౌన్ 4.O
16-05-202016-05-2020 13:27:10 IST
Updated On 17-05-2020 09:19:58 ISTUpdated On 17-05-20202020-05-16T07:57:10.079Z16-05-2020 2020-05-16T07:56:27.756Z - 2020-05-17T03:49:58.983Z - 17-05-2020

రేపటితో ముగియనున్న మూడో విడత లాక్ డౌన్ తరవాత కేంద్రం ఏం చేయబోతోంది. సోమవారం నుంచి లాక్డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఈసారి నాలుగో లాక్ డౌన్ ఎలా వుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయోనని అంతా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్ పంపాలని సూచించారు. దీనికి సంబంధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా.. ఆర్ధిక కార్యకలాపాలకు మరిన్ని సడలింపులను ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాచాయి. జోన్లు, హాట్స్పాట్ల నిర్ణయం ఆయా రాష్ట్రాలకే వదిలేయనుంది. ఆర్థికంగా వెసులుబాట్లు వుండాలని, ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు నడవడానికి అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానమంత్రిని కోరుతున్నాయి. కంటెయిన్మెంట్ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగనివ్వాలని తమిళనాడు కోరింది. 18వ తేదీ నుంచి 50శాతం సిబ్బంది కార్యాలయాలకు రావాలని ఆ రాష్టంలో ఉత్తర్వులు జారీ చేసింది. కంటెయిన్మెంట్ జోన్లు మినహా రెడ్జోన్లలో కటింగ్ షాపులు, కళ్లజోళ్ల షాపులు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. లాక్డౌన్ పూర్తి ఎత్తివేతను ఏ రాష్ట్రమూ కోరుకోవడం లేదు. ఎందుకంటే లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి చేయిదాటిపోవచ్చంటున్నారు. నిత్యావసరేతర వస్తువులను విక్రయించడానికి సరి-బేసి సంఖ్య విధానంలో దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, మాల్స్‌ను తెరిచేందుకు తదుపరి లాక్‌డౌన్‌లోనూ అనుమతి ఉండదు. వివిధ వస్తువుల హోం డెలివరీకి అవకాశం ఉంటుంది. మెట్రో రైళ్లు, స్థానిక రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ కోరిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో అన్నిరకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలన్నది గుజరాత్ డిమాండ్. కంటెయిన్మెంట్ జోన్లలో మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తేసి వ్యాపార కార్యకలాపాలకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. మహారాష్ట్ర మాత్రం లాక్డౌన్ మినహాయింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. వలస కూలీల రాకతో ఇబ్బందులు పడుతున్న ఝార్ఖండ్, ఒడిశాలు లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి. ఇక బిహార్, మిజోరం రాష్ట్రాలు ఇప్పటికే మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్ చేశారు. పరిమిత ఆంక్షలతో రవాణా సదుపాయాలు పునరుద్ధరించే అవకాశం ఉందని, రోడ్డురవాణా సంస్థల బస్సులు పరిమితంగా తిరుగుతాయని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. జోన్లను నిర్దారించే అవకాశం రాష్ట్రాలకే ఇవ్వనుంది కేంద్రం. హాట్ స్పాట్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు చేపట్టనుంది. అటు సెలూన్స్, బార్బర్ షాప్స్, స్పాస్ రెడ్ జోన్లలో ఓపెన్ చేసే అవకాశం ఉందని.. అలాగే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం అన్ని మూసి ఉంటాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో హెయిర్ సెలూన్లు తెరిచి ఉన్న సంగతి విదితమే. అటు పరిమితంగా రైళ్లు, బస్సులు, దేశీయ విమానాలు కూడా తిరిగే అవకాశముందని అంటున్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
12 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
13 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా