కొనసాగుతున్న ఏడో విడత పోలింగ్
19-05-201919-05-2019 08:30:46 IST
Updated On 27-06-2019 15:35:05 ISTUpdated On 27-06-20192019-05-19T03:00:46.058Z19-05-2019 2019-05-19T02:59:14.544Z - 2019-06-27T10:05:05.455Z - 27-06-2019

సార్వత్రిక ఎన్నికల్లో చివరి విడత అయిన ఏడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఏడో విడతలో 10.02కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5.27కోట్లు కాగా.. 4.75కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బిహార్‌లో 8, ఝార్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 8, పంజాబ్‌లో 13, పశ్చిమబెంగాల్లో 9, చండీగఢ్‌లో 1, ఉత్తరప్రదేశ్‌లో 13, హిమాచల్‌ప్రదేశ్‌లో 4 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని 13 నియోజకవర్గాలతో పాటు, పంజాబ్ లోని 13 సీట్లు, పశ్చిమబెంగాల్లోని 9 సీట్లు, బీహార్ లోని 8 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 8 సీట్లు, హిమాచల్ ప్రదేశ్ లోని 4 సీట్లు, జార్ఖండ్ లోని 3 సీట్లు, చండీగఢ్ లోని ఒక స్థానంలో ఏడో దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 59 సీట్లలో 918 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం లక్ష 12 వేల 986 పోలింగ్ సెంటర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ దశ పోలింగులో ప్రధానంగా పశ్చిమ బెంగాల్ మీదే అన్ని పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి ఎంపీ సీటులో కూడా ఏడో దశలోనే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ బరిలో ఉంటే, సమాజ్ వాదీ పార్టీ నుంచి షాలిని యాదవ్ పోటీ చేస్తున్నారు. అలాగే వారణాసి సీటుతో పాటు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సీటు గోరఖ పూర్ లో కూడా ఏడో దశలోనే ఎన్నిక జరుగుతోంది. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 8 ఎంపీ సీట్లలో ఆరు చోట్ల గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాట్నాసాహెబ్ ఎంపీ సీటు నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే, ఆయన మీద కాంగ్రెస్ అభ్యర్థిగా శత్రుఘ్నసిన్హా బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ లోని గురుదాస్ పూర్ సీటు కూడా హాట్ టాపిక్ అయింది. ఇక్కడ బీజేపీ నుంచి సన్నీ డియోల్ పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ బలరాం జక్కర్ మనవడు సునీల్ జక్కర్ బరిలో ఉన్నారు. అలాగే అమృత్ సర్ ఎంపీ సీటు నుంచి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి బరిలో ఉంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్జీత్ సింగ్ అజులా పోటీ పడుతున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఏడో దశలో కూడా పోటాపోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ర్యాలీ సందర్భంగా హింస రేగిన కోల్ కతా ఉత్తరం, కోల్ కతా దక్షణం ఎంపీ సీట్లలో కూడా ఏడో దశలోని పోలింగ్ జరుగుతోంది.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
44 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా