newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొత్త పార్టీ వైపు.. సావిత్రిభాయి పూలె చూపు

26-12-201926-12-2019 13:17:46 IST
2019-12-26T07:47:46.286Z26-12-2019 2019-12-26T07:47:36.505Z - - 23-04-2021

కొత్త పార్టీ వైపు.. సావిత్రిభాయి పూలె చూపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పటి బీజేపీ మాజీ ఎంపీ సావిత్రి భాయి ఫూలే కొత్త పార్టీ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన సావిత్రి భాయి పూలె కొంతకాలం క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీకి సైతం రాజీనామా చేశారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీన సావిత్రి భాయి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ గాంధీ సమక్షంలో చేరారు. ఆమె బీజేపీలో వున్నప్పుడు కూడా దళితుల కోసం పోరాటం చేశారు. పార్టీలో ఆమెని ఫైర్ బ్రాండ్ అనేవారు.

 బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఆమె తనదైన వ్యక్తిత్వాన్ని కొనసాగించారు. బీజేపీలో చేరకముందే ఆమె బీఎస్పీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 15 ఏళ్ల వయసులో అంబేద్కర్ ఆశయాలను ఆమె వంటబట్టించుకున్నారు. బీఎస్పీ ఆమెలోని నాయకత్వ పఠిమను గుర్తించింది. 2000 సంవత్సరంలో బీఎస్పీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. 2001లో జిల్లా పంచాయతీ ఎన్నికల్లో సావిత్రీ బాయి పోటీ చేసి విజయం సాధించారు.

ఏ పార్టీలో ఉన్నా, ఆమె స్వతంత్ర భావాలు కలిగి వుండేవారని ఆమె సన్నిహితులు చెబుతారు. చెప్పాలనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ఎవ్వరూ ఆమెను శాసించలేరు. ఎవరికీ ఆమె భయపడేవారు కాదు. బాల్యం నుంచి అన్యాయాన్ని ఎదిరించడమే ఆమె స్వభావం. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సావిత్రి భాయి ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీలో తన మాటకు గుర్తింపు ఇవ్వడంలేదని ఆమె మనస్తాపం చెందారు. ఈ కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన సావిత్రి భాయి.. త్వరలోనే కొత్త పార్టీని స్థాపిస్తానని స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన‌ పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఫూలే పోటీ చేయలేదు. సావిత్రభాయి పూలె స్థాపించబోయే పార్టీ ఎలా వుంటుందనేది కొంతకాలం ఆగితే గానీ తెలీదు. 

 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   38 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle