newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కొంప ముంచిన లాక్ డౌన్: రూ.700 కోట్ల విలువైన బీర్లు.. వేస్టేనా?

04-05-202004-05-2020 12:39:08 IST
Updated On 04-05-2020 13:02:34 ISTUpdated On 04-05-20202020-05-04T07:09:08.201Z04-05-2020 2020-05-04T07:09:01.284Z - 2020-05-04T07:32:34.776Z - 04-05-2020

కొంప ముంచిన లాక్ డౌన్: రూ.700 కోట్ల విలువైన బీర్లు.. వేస్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే ఒక్క వైరస్.. ప్రపంచాన్ని ముప్పుతిప్పులు పెడుతోంది. కరోనా వైరస్ కారణంగా అన్ని వ్యాపారాలు ఆగిపోయాయి. కంపెనీలు దివాళా దశకు చేరుతున్నాయి.  లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. బీర్లు, ఇతర మద్యం తయారీ కేంద్రాల్లో నిల్వలు పేరుకుపోయి, వాటిని ఏం చేయాలో తెలీక కంపెనీలు తలలు పట్టుకున్నాయి. బార్‌లు, క్లబ్‌ల్లో లభ్యమయ్యే ప్రెష్‌, క్రాఫ్ట్ బీరు త్వరగా పాడయిపోతోందని యజమానులు మొత్తుకుంటున్నారు. 

వీటి నిల్వలను ఏం చేయాలో అర్థంకావడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో కరెంట్, ఇతర ఖర్చులు మీద పడుతుండటంతో తయారీ కేంద్రాలకు నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో నిల్వలను ఖాళీ చేసేందుకు తయారీ కేంద్రాలు సిద్ధమయ్యాయి. హరియాణా గుర్‌గ్రామ్‌లోని కొన్ని కేంద్రాలు బీర్లను కింద పోసేస్తున్నాయి. వీటి విలువ భారీగానే వుంటుందని  క్రాఫ్ట్ బ్రూవర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా చెబుతోంది. 

https://www.photojoiner.net/image/aAPAiSgpమద్యం కోసం క్యూలు.. షాపుల ముందు మందుబాబుల చిందులు 

దేశంలో మద్యం తయారుచేసే అన్ని ప్లాంట్లలో కలిపి ఎనిమిది లక్షల లీటర్ల ప్రెష్‌ బీర్ నిల్వలు ఉన్నాయి. లాక్‌డౌన్ ఇలానే కొనసాగితే ఆ బీరంతా పాడవుతుంది కాబట్టి.. మైక్రో బ్రూవరీస్ వ్యాపారం దెబ్బతినకుండా.. గ్రోలర్స్‌ సాయంతో టేక్‌- అవే సదుపాయానికి అనుమతించాలని అసోషియేషన్‌ డిమాండ్ చేసింది. మరోవైపు ఢిల్లీ మినహా ఉత్తర భారతంలో రూ.700కోట్ల విలువైన విదేశీ మద్యం నిల్వలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ నిల్వలు ఖాళీ కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో అవన్నీ అలానే ఉండగా.. పాత స్టాక్ విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇవ్వాలి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. 

మరోవైపు లాక్ డౌన్ 3.O అమలులోకి వచ్చిన వేళ గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం ఓకే చెప్పింది. దేశవ్యాప్తంగా మద్యం కోసం జనం బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మద్యం కోసం ఎంత దూరమయినా క్యూలైన్లలో నిలబడ్డారు మద్యం బాబులు.  దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు కావడంలేదు. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతాయేమోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   an hour ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   3 hours ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   2 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   4 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   5 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   5 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   21 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle