newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్, జగన్‌లకు ఢిల్లీ పిలుపు...

03-10-201903-10-2019 10:09:03 IST
2019-10-03T04:39:03.086Z03-10-2019 2019-10-03T04:39:01.201Z - - 20-04-2021

కేసీఆర్, జగన్‌లకు ఢిల్లీ పిలుపు...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో చీమ చిటుక్కుమన్నా అదో సంచలన వార్త అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు కూడా వీటి ముందు బలాదూరే అన్నంతగా మీడియాలో సీన్ తయారవుతోంది. దేశంలో ఏ ముఖ్యమంత్రయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలను కలవడంలో మామాలుగా అయితే పెద్ద వార్త కాకపోవచ్చు కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల  కదలికలపై మీడియా ఎంతగా గురిపెట్టిందంటే అసలు వార్తల కంటే కొసరు వార్తలు శరవేగంగా పాకిపోవడం జరిగిపోతోంది. ఈ కోవలో తాజా సంచలన వార్త మోదీతో కేసీఆర్ భేటీ. మోదీతో జగన్ భేటీ..

అక్టోబర్ 4న తాను ప్రధాని మోదీని కలవడానికి ఢిల్లీ వెళుతున్నానని హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తానూ 5న ప్రధాని తో భేటీకి హస్తిన వెళుతున్నానని  తాడేపల్లి గూడెంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం అలా ప్రకటించారో లేదా.. వార్తలు జుయ్ మంటూ వ్యాపించిపోయాయి.

ఇద్దరు సీఎంలు ప్రధానిని కలవడానికి వెళుతున్నారంటే అది నూటికి 90 శాతంపైగా అధికారపూర్వకంగానే, తమ తమ రాష్ట్రాల సమస్యలను ఏకరవు పెట్టి కేంద్ర సహాయం అడగడానికే జరుగుతుందని సహజ జ్ఞానం తెలివిడిని అందించవచ్చు. కానీ తెలుగు సీఎంలు ఎందుకు తాజాగా విడివిడిగా ప్రధానితో ఢిల్లీలో భేటీ అవుతున్నారన్నది రకరకాల ఊహాపోహలకు దారి తీయడమే విశేషం.

వివరాల్లోకి వెళితే.. తెలుగు సీఎంలలో కేసీఆర్‌కు అక్టోబర్ 4న ప్రధానితో భేటీకీ అప్పాయింట్‌మెంట్ కుదిరిందని తెలంగాణ సీఎం కార్యాలయం అలా వార్త వదిలిన గంటల్లోపే ఏపీ సీఎం కూడా అక్టోబర్ 5న ప్రధానితో భేటీ కానున్నారని ఏపీ సీఎం కార్యాలయం మీడియాకు సమాచారమిచ్చింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలనుంచి సీఎంల ఢిల్లీ పయనం గురించి అధికారిక సమాచారం రావడం మొదలు అటు మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో వేడి వేడి చర్చలు వేగం పుంజుకున్నాయి.

ఈ చర్చల సారాంశంలో పైకి తేలిన అంశాలు ఏవంటే.. 9 నెలలవిరామం తర్వాత కేసీఆర్ ప్రధానిని ఎందుకు కలుస్తున్నారు.. అలాగే ప్రతి శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి తనపై కేసుల విచారణ కోసం హైదరాబాద్ లోని సీబీఐ న్యాయస్థానానికి రావలసిందేనని సీబీఐ తరపున ప్రాసిక్యూటర్ బుధవారమే వాదించిన నేపధ్యంలో వైఎస్ జగన్ ఇంత ఉన్నఫళాన మోదీతో ఎందుకు భేటీ అవుతున్నారన్నదే. దాదాపు బుధవారం మొత్తంగా సోషల్ మీడియాలో, టీవీ చర్చల్లో ఇదే రగడ. ఎట్టకేలకు సుదీర్ఘ జాప్యం తర్వాత కేసీఆర్ ప్రధాని అప్పాయింట్‌మెంట్ దక్కించుకున్నారన్న వ్యాఖ్యతో చర్చ మొదలై ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. వాస్తవాలు ఏమిటో పరిశీలిద్దాం.

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నారు. అంతకుముందుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారని తెలుస్తోంది. అపెక్స్ కౌన్సిల్‌లో బేటీ దేనికి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా వాయిదాలో ఉన్న నీటి సమస్యల పరిష్కార కోసమని సమాచారం.

ఇద్దరు తెలుగు సీఎంలు ఈ భేటీలో పాల్గొంటున్నారని సమాచారం. అనంతరం కేసీఆర్ ముందుగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. డిసెంబర్ 26న అంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో దఫాలో కూడా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత గత డిసెంబర్ 26న కేసీఆర్ ప్రధానితో సమావేశమయ్యారు. 

తెలంగాణకు సంబంధించి చాలా కాలంగా పెండింగులో ఉన్న డిమాండ్లను మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకుపోయారు. ఆ తర్వాత వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీకి కేసీఆర్‌కి మధ్య కనీస సంబంధాలు కూడా బెడిసికొట్టాయన్నే వార్త ప్రచారమైంది. దక్షిణాదిలో బీజేపీకి అడ్డుకట్టవేయాలని దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కేసీఆర్ దక్షిణ భారత ముఖ్యమంత్రులతో, రాజకీయ ప్రముఖులతో చేయి కలిపారన్న వార్త గుప్పుమనడం, బీజేపీ అగ్రనాయకత్వం, ప్రధాని మోదీ కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో కేసీఆర్ అనేకసార్లు మోదీతో భేటీకీ ప్రయత్నాలు చేసీ విఫలమయ్యారు. 

ప్రధాని మోదీ రెండోసారి కూడా ఘనవిజయం సాధించి రెండో దఫా అధికారంలోకి వచ్చాక మర్యాద కోసమైనా కేసీఆర్ ప్రధానిని కలవలేక పోయారన్నది వాస్తవం. తర్వాత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు. తర్వాత రెండుసార్లు ప్రధాని నేతృత్వంలో జరిగిన నీతిఅయోగ్ సమావేశానికీ, ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అఖిల ఫక్ష సీఎంల భేటీకి కూడా కేసీఆర్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు.

అంతకంటే మిన్నగా జూన్ 21న కాళ్వేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల ప్రారంభోత్సవానికి అయితే ప్రధాని మోదీని కేసీఆర్ అసలు అహ్వానించలేదు. పైగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ సీఎంపై రాష్ట్ర బీజేపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. 

మరి ఇన్ని నెలలతర్వాత బయటకు తెలీని కారణాలతో మోదీ కేసీఆర్‌కు అప్పాయింట్‌మెంట్ ఇచ్చి ఉంటారనేది మీడియా సందేహం. ఇద్దరు నేతలూ అక్టోబర్ 4న భేటీలో ఏం చర్చించనున్నరనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రధానితో సమావేశమైతే ఏయే అంశాలపై చర్చిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

నిజానికి తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌తో అమీతుమీ అంటోంది బీజేపీ. ఓ వైపు ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికతో రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో జరగబోయే భేటీలో కేవలం పరిపాలనకు సంబంధించిన అంశాలు మాత్రమే చరిస్తారా ? లేక రాజకీయపరమైన అంశాలపై మాట్లాడతారా అన్నది ఆసక్తి గొలుపుతోంది. 

తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం సహా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బృహత్తర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందని, దీనికి కేంద్ర సహకారం అవసరమని కేసీఆర్‌ ప్రధానికి వివరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉన్న డ్యామ్‌ సేఫ్టీ బిల్లు, నదీ జలాల యాజమాన్య బిల్లు వచ్చే నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందితే నదీజలాలతో పాటు దేశంలోని ఆనకట్టలన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి.

కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మోదీ సహకారం కోరేందుకు కేసీఆర్‌ ఢిల్లీ వస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే  సీఎంలు కేసీఆర్, జగన్ వరుస భేటీలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. 

ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై జగన్ చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ప్రత్యేక హోదాపై మరోసారి ప్రధానికి విన్నవించడంతో మొదలుకుని రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, తక్కువ కాలంలోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన,  బెల్టుషాపుల ఎత్తివేత, మద్యనిషేధంపై పథకం ప్రకారం చర్యలు, రివర్స్ టెండరింగ్‌పై అలుముకున్న వివాదాలు, పోలవరం, రాజధాని పనుల స్తంభన వంటి అంశాలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం గురించి కూడా ఏపీ సీఎం ప్రధానికి విన్నవించనున్నారని భోగట్టా.

రెండు రాష్ట్రాల సీఎంలు తమ తమ ప్రాధాన్య సమస్యలపై ప్రధానికి వివరించనున్నారనేది ఒక అంశంకాగా, చక్రబంధనంలో తెలుగు సీఎంలను ఇరికించే ప్రయత్నంలో మోదీ ఉన్నారని, తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతిపై కేసీఆర్‌ను, సీబీఐ కేసుల ఒత్తిడితో వైఎస్ జగన్‌ను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగా వీరికి మోదీ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారంటూ ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తునే చెలరేగడం గమనార్హం. మీడీయా ఊహాగానాలను పక్కకు పెడితే...ఇద్దరు సీఎంలు ప్రధానితో లాంఛనప్రాయం భేటీ కానున్నారని తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రధానితో భేటీలో చర్చించవచ్చని, ఇరు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం  తగిన చర్యలు తీసుకుంటారనే సానుకూల దృష్టితో ఆలోచిస్తే ఏ తంటా ఉండదు కదా.

 

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   14 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   14 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   18 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   15 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   a day ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   a day ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle