newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేరళ, కర్నాటకల్లో లాక్ డౌన్ కఠిన ఆంక్షలు

06-07-202006-07-2020 18:47:31 IST
2020-07-06T13:17:31.066Z06-07-2020 2020-07-06T13:17:18.301Z - - 17-04-2021

కేరళ, కర్నాటకల్లో లాక్ డౌన్ కఠిన ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కరోనా లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేశాయి. కోవిడ్‌–19కు సంబంధిం చిన ఆంక్షలు మరో ఏడాది పాటు అమలయ్యేలా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి అమలవుతున్న ఆదేశాలకు తోడుగా మరో ఏడాది పాటు కొనసాగేందుకు వీలు కల్పించేలా కేరళ ఎపిడెమిక్‌ డిసీజెస్‌ ఆర్డినెన్స్‌– 2020కి అదనపు నిబంధనలను జోడించింది. వీటి ప్రకారం మరో ఏడాది పాటు పెద్ద సంఖ్యలో జనం గుమికూడడంపై నిషేధం కొనసాగుతుంది. 

కేరళలో అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. రహదారులు, కాలిబాటలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో  ఉమ్మి వేయరాదు. మాస్క్ ధరించడం తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువమంది గుమిగూడవద్దు. ఇటు క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురగి, హుబీల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం ప్ర‌తి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌‌డౌన్‌ను వ‌చ్చేనెలా 2వ తేదీ వ‌ర‌కు పాటించ‌నున్న‌ట్లు గ‌త మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ సమయంలో అత్య‌వ‌స‌ర విభాగాల‌కు అనుమ‌తి వుంటుంది.  

ఇప్పటికే ఆదివారాల్లో ముందుగా అనుమతి పొందిన వివాహాలకు నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చిన‌ట్లు తెలిపింది. అత్య‌వ‌స‌ర విభాగాల్లో సేవ‌లందించే వారు మిన‌హా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్లు ఆగస్టు రెండో వారం వరకు అన్ని శనివారాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తం 21,549 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 11, 970 మంది చికిత్స పొందుతుండ‌గా, 9,244 మంది కోలుకోగా, 335 మంది వైర‌స్‌తో చ‌నిపోయారు.

ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు సైజును బట్టి సంఖ్యను తగ్గించాలి. అంతరాష్ట్ర ప్రయాణాలకు పాస్‌లు అవసరం లేదు. కానీ ఈ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం రిజిస్టర్‌‌ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మన దేశంలో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైంది. అక్కడ జనవరిలో మొదటి కేసు నమోదు కాగా.. ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle