newssting
BITING NEWS :
*అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం *నా వల్ల.. వంశీ వల్ల జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారంటూ టీడీపీ అడ్డగోలు కామెంట్లు - మంత్రి కొడాలి నాని *సీఎం జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది..?-మంత్రి నాని *ఆర్టీసీ, రవాణాశాఖాదికారులతో సీఎం కేసీఆర్ భేటీ*శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదంటున్న డ్యామ్ సేఫ్టీ అధికారులు *తూ.గో: ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్*విజయవాడ: స్టెల్లా కాలేజీలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత*2021 అసెంబ్లీ ఎన్నికలు అద్భుతాలు ఖాయం-రజనీకాంత్

కేరళలో రెచ్చిపోతున్న విద్యార్థి సంఘాలు

07-05-201907-05-2019 07:50:31 IST
2019-05-07T02:20:31.144Z07-05-2019 2019-05-07T02:20:22.850Z - - 22-11-2019

కేరళలో రెచ్చిపోతున్న విద్యార్థి సంఘాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కేర‌ళ‌లో లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘాలు బ‌రితెగిస్తున్నాయ‌ట‌. కొత్తగా కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల‌ను త‌మ యూనియ‌న్లో చేరాలంటూ బెదిరిస్తున్నాయ‌ట‌. తాజాగా తిరువ‌నంత‌పురం యూనివ‌ర్శిటీ కాలేజీలో డిగ్రీ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతున్న ఓ విద్యార్థిని మీద కూడా స్థానిక స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా నేత‌లు బెదిరింపుల‌కు దిగార‌ట‌. 

త‌ర‌గ‌తులు జ‌రిగే స‌మ‌యంలో ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల‌కు రావాలంటూ ఒత్తిడి చేయ‌డంతో, ఆ విద్యార్థిని ఆత్మహ‌త్యాయ‌త్నం చేసింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ చ‌దువుకుంటున్న ఆ విద్యార్థినిని మొద‌టి నుంచీ టార్గెట్ చేసిన ఎస్ఎఫ్ఐ కార్యక‌ర్తలు, త‌ర‌గ‌తుల‌కు వెళ్లకుండా అడ్డుకుంటున్నార‌ట‌. దీంతో కాలేజి హైయ్యర్ అథారిటీకి ఫిర్యాదే చేయాల‌ని భావించిన ఆ విద్యార్థినిని స్నేహితులు వారించార‌ట‌. ఫిర్యాదు చేస్తే హాస్టల్లో ఇబ్బందులు పెడ‌తార‌ని చెప్పడంతో కొన్నాళ్లుగా ఆమె మౌనంగా ఉంది. 

అయితే ఎస్ఎఫ్ఐ దాష్టికాలు ఎక్కువ కావడంతో ఆమె మ‌ణిక‌ట్టు కోసుకుని ఆత్మహ‌త్యాయ‌త్నం చేసింద‌ని పోలీసులు చెబుతున్నారు. అయితే రెండు రోజులుగా త‌మ కుమార్తె నుంచి ఎలాంటి స‌మాచారం లేద‌నీ, హాస్టల్ సిబ్బంది కూడా త‌మ కుమార్తె గురించి స‌రైన స‌మాధానం చెప్పడంలేద‌ని ఆ విద్యార్థిని త‌ల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ వెయిట్ రూంలో అప‌స్మార‌క‌స్థితిలో ఉన్న త‌మ కుమార్తె ప‌డి ఉండ‌టాన్ని చూస్తే, కావాల‌నే ఎవ‌రో చేశార‌ని ఆరోపిస్తున్నారు. 

గ‌తేడాది కూడా ఓ ఏబీవీపీ కార్యక‌ర్తలపై లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘం నేత‌లు దాడి చేయ‌డంతో అత‌ను చ‌నిపోయాడు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు అయిన‌ప్పటి నుంచీ కామ్రేడ్లు రెచ్చిపోతున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్రధానంగా లెఫ్ట్ పార్టీల విద్యార్థి సంఘాలు ఏబీవీపీ కార్యక‌ర్తల‌ను టార్గెట్ చేస్తున్నార‌ట‌.

కాలేజీల్లో రాజ‌కీయాలు ఏంట‌ని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. కాలేజీల్లో విద్యార్థి సంఘాల ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌నీ, యూనియ‌న్లు, సంఘాల పేరుతో విద్యార్థులు చెడు మార్గం వైపు మ‌ళ్లుతున్నారంటూ కేర‌ళ హై కోర్టులో ఓ పిటిష‌న్ దాఖలైంది. అంటే ఇప్పుడు నిర్ణయం కోర్టు ద‌గ్గర పెండింగులో ఉంది.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle