కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!
17-02-202017-02-2020 13:11:00 IST
Updated On 17-02-2020 13:10:58 ISTUpdated On 17-02-20202020-02-17T07:41:00.358Z17-02-2020 2020-02-17T07:40:53.152Z - 2020-02-17T07:40:58.624Z - 17-02-2020

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తన పట్ల ఢిల్లీ ప్రజల ప్రేమకు వెలకట్టలేమని అన్నారు. ప్రపంచంలో అద్భుతమైన, వెలకట్టలేని విషయం ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే అని పేర్కొన్నారు. రామ్‌లీలా మైదానంలో ఆదివారం ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో పాడిన పాట, మాట్లాడిన మాటలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రజలను కదిలించివేశాయి. ప్రమాణ స్వీకారం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘బిడ్డపై తల్లిదండ్రులు చూపించే ప్రేమకు వెలకట్టలేం. నాపై ఢిల్లీ ప్రజలు చూపించే ప్రేమ కూడా అలాంటిదే. నా రాష్ట్ర ప్రజలపై నాకున్నది కూడా ప్రేమే. ఎన్నికల ప్రచారంలో నాపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఆరోపణలు చేశాయి. కేజ్రీవాల్ అన్నీ ఉచితం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రిగా.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా సంక్షేమం అందించడం తప్పా. విద్య, వైద్యం కూడా డబ్బులు తీసుకుని అందించాలా. అది ఎంత సిగ్గు చేటు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున ఇక రాజకీయాల గొడవ వదిలేయాలని ఆయన ప్రజలను కోరారు. పార్టీ ఏదైనా, ఎవరికి ఓటేసినా ఢిల్లీ జనమంతా ఒకే కుటుంబంగా అభివృద్ధి వైపు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అని కాకుండా అందరం ఒకే ఫ్యామిలీ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తన పట్ల ఢిల్లీ ప్రజల ప్రేమకు వెలకట్టలేమని అన్నారు. ప్రపంచంలో అద్భుతమైన, వెలకట్టలేని విషయం ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే అని పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగింపు సమయంలో కేజ్రీవాల్ పాడిన ఒక పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'నేను ఇప్సుడు ఒక పాట పాడతాను. కానీ ఒక షరతు.. అదేంటంటే.. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన చాలా అవసరం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'హమ్ హోంగే కామ్ యాబ్'(వి షాల్ ఓవర్‌కమ్) పాటను పాడి.. అందరితో పాడించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వియ్ షల్ ఓవర్ కమ్ అంటే మనం కష్టాలను అధిగమిద్దాం అంటూ సాగే ఆ పాటకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. 1960లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో (వి షాల్ ఓవర్‌కమ్) పాట ఎంతో ప్రాచుర్యం పొంది.. వారి ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.ఇంతకుముందు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార ముగింపు సమయంలో కేజ్రీవాల్ ఇలాగే హిందీ చిత్రం 'పైగాం'లోని 'ఇన్సాన్ కా హో ఇన్సాన్ సే భైచారా' అనే దేశభక్తి గీతం ఆలపించడం విశేషం. ఢిల్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 గెలవగా, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
17 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
16 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
20 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా