newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేజ్రీవాల్ గెలుపుపై ఆరెస్సెస్‌లో సంబరాలు.. ఎందుకు?

13-02-202013-02-2020 10:24:37 IST
Updated On 13-02-2020 16:00:06 ISTUpdated On 13-02-20202020-02-13T04:54:37.497Z13-02-2020 2020-02-13T04:54:35.632Z - 2020-02-13T10:30:06.660Z - 13-02-2020

కేజ్రీవాల్ గెలుపుపై ఆరెస్సెస్‌లో సంబరాలు.. ఎందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దశాబ్దాలుగా ఆరెస్సెస్ ఒక లక్ష్యంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ వస్తుందనేది తెలిసిన విషయమే. ఈ దేశ రాజకీయ నాయకులు ఏమాత్రం భయం, సంకోచాలు లేకుండా హిందూ మత చిహ్నాలను, గుర్తులను ధరించే సంస్కృతిని పెంపొందించడమే దాని లక్ష్యం. అలాగే బహిరంగంగా ఈ నేతలు భారత్ మాతాకీ జై, వందే మాతరం అనే నినాదాలను ఇవ్వాలనేది కూడా ఆరెస్సెస్ సంస్థ చిరకాల కోరిక. 

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో హనుమాన్ భక్తుడిగా అరవింద్ కేజ్రీవాల్ బహిరంగంగానే ప్రజల ముందుకు వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగంలో ఢిల్లీని ఆశీర్వదించిన హనుమాన్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు భారత రాజకీయాల్లో కొత్త ఉషోదయాన్ని తీసుకువచ్చిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 

ఢిల్లీ ఫలితాలు తెచ్చిన నవ్యత్వం ఏదంటే కామ్ కా రాజనీతి అంటే పని చేసే రాజకీయాలు. ప్రభుత్వాలు చేపట్టే.. పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్తు వంటి అభివృద్ధి పనుల ప్రాతిపదికన ప్రజలు ఓటు వేస్తారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశానికే ఇది మంగళకరమైన సందేశమని చెప్పారు.

సందేహమే లేదు, వినడానికి ఆయన ప్రకటన చాలా కొత్తగా ఉంది. ప్రత్యేకించి రాజకీయ వాతావరణం భయంకరమైన అవ్యవస్థ యొక్క రణగొణ ధ్వనుల విషపూరితమైపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రసంగం నవ్యత్వంతో కూడుకుని ఉంది. కానీ అభివృద్ధి మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌కి ఇంతటి ఘనవిజయాన్ని సాధించి పెట్టలేదన్నది వాస్తవం.

తనదైన జాతీయవాద బ్రాండుతో కరడు గట్టిన హిందూత్వ రాజకీయాలను మిళితం చేసి బీజేపీ ప్రజలను విభజించే రాజకీయాలను పరాకాష్టకు తీసుకుపోగా కేజ్రీవాల్ హనుమాన్ భక్తుడిగా తననుతాను కొత్తగా మార్చుకున్నారు. జైహింద్, వందేమాతరం అని నినదించడం ద్వారా తన మత అస్తిత్వాన్ని ప్రదర్సించుకోవడంలో కేజ్రీవాల్ సిగ్గుపడలేదు. వెనుకాడలేదు.  ఢిల్లీని ప్రస్తుతం మండిస్తున్న సీఏఏ, ఎన్నార్సీ, షహీన్ బాగ్ వంటి అసౌకర్యం కలిగించే అంశాల జోలికి పోకుండానే కేజ్రీవాల్ అభివృద్ధే తన మార్గమని బలంగా చెప్పుకున్నారు.

ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తర్వాత, తన మతపరమైన అస్తిత్వాన్ని కూడా తన ప్రసంగంలో కేజ్రీవాల్ స్పర్శించారు. ఆ విధంగా తనపే ఎవరికైనా ఉండే సందేహాలను కూడా పూర్తిగా తొలగించారు. ఈరోజు మంగళవారం, ఇది హనుమాన్ దినం. దేవుడు ఢిల్లీని ఆశీర్వదించారు. ఈ విజయానికి ఆ దేవుడికే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు కేజ్రీవాల్.

ముందే చెప్పుకున్నట్లుగా ఈ దేశ రాజకీయ నాయకులు ఏమాత్రం భయం, సంకోచాలు లేకుండా హిందూ మత చిహ్నాలను, గుర్తులను ధరించే సంస్కృతిని పెంపొందించడమే ఆరెస్సెస్ లక్ష్యం. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యా జోషి దీన్నే తాజాగా మరింత గట్టిగా నొక్కి చెప్పారు. ఆయన ప్రకారం హిందూ మతం అంటే భారతీయ జనతాపార్టీ అని కాదు. బీజేపీని వ్యతిరేకించడం అంటే  హిందువులను వ్యతిరేకించడం అని అర్థం కాదన్నారు. రాజకీయ పోరాటం కొనసాగాలని కానీ దాన్ని హిందువులతో ముడిపెట్టవద్దని భయ్యాజీ స్పష్టం చేశారు.

అందుకే లోక్ సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కైలాస్ మానసరోవర్ సందర్శనకు వెళ్లారు. పైగా తాను శివభక్తుడిననీ చెప్పుకుంటూ ఒక ఆలయం తర్వాత మరో ఆలయాన్ని సందర్శిస్తూ వెళ్లారు. అప్పుడే ఆరెస్సెస్ తన లక్ష్యానికి ఘనవిజయం దక్కనుందని పసిగట్టింది.

తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ హిందూయిజం గురించి గర్వంగా చెబుతూ నేను ఎందుకు హిందువును అనే పుస్తకంలో బీజేపీ విభజన రాజకీయాలను దుమ్మెత్తిపోసినప్పుడు కూడా ఆరెస్సెస్ ఆగ్రహించకుండా తన పంధాకు విజయం దక్కుతోందని గ్రహించింది.

ఈ నేపథ్యంలో బీహార్, పశ్చిమబెంగాల్ రాష్టాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీయేతర నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మమతా బేనర్జీ వంటి వారు పుట్టుకొస్తే ఆశ్చర్యపోవలసింది ఏదీ లేదు లాలూ యాదవ్ ఆర్జేడీ వంటి వారు ఈకోవలో ముందుండి తాము శివ, కృష్ణ భక్తులమని చెప్పుకోవచ్చు.

ఢిల్లీలో బీజేపీ ఘోరపరాజయం పొంది ఉండవచ్చు గాక. కానీ బీజేపీయేతర రాజకీయ పార్టీలలో వాటి నాయకులలో వస్తున్న ఈ కొత్త పరివర్తన ఆరెస్సెస్‍‌కి మహదానందం కలిగిస్తోంది. తమ మూలాలు హిందూ మతంలోనే ఉన్నాయని, తాము హిందూ దేవతల భక్తులమేనని ఈ నాయకులు ఇన్ని దశాబ్దాల తర్వాత బహిరంగంగా చెప్పుకుంటూండటమే ఆ పరివర్తన. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకపోరాటం అనే పేరున హనుమాన్ భక్తులు, శివభక్తులు రాజకీయ పార్టీలలో ఆవిర్భవిస్తుండటం ఆరెస్సెస్ ప్రధాన ఎజెండాకు గొప్ప గెలుపు అనే చెప్పాలి.

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   29 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   2 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   a minute ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   a day ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle