newssting
BITING NEWS :
* మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

కేజ్రీవాల్ కామెంట్లతో ఖంగుతిన్న రాహుల్

13-05-201913-05-2019 07:59:11 IST
Updated On 28-06-2019 13:12:01 ISTUpdated On 28-06-20192019-05-13T02:29:11.199Z13-05-2019 2019-05-13T02:28:01.587Z - 2019-06-28T07:42:01.488Z - 28-06-2019

కేజ్రీవాల్ కామెంట్లతో ఖంగుతిన్న రాహుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయ ర‌ణ‌రంగంలో ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటే దెబ్బ‌తిన‌డం ఖాయం. త‌మ అంచ‌నాలు ఎప్పుడూ ఫ‌లిస్తాయ‌న్న భ్ర‌మ‌లో, మితిమీరిన న‌మ్మ‌కంతో ఉంటే బొక్క‌బోర్లా ప‌డ‌క త‌ప్ప‌దు. ఇప్పుడు ఈ విష‌యాల‌ను తెల్సుకునేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సిద్ధంగా లేర‌ట‌. ఓవైపు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దించాల‌ని చెబుతున్న రాహుల్ గాంధీ, త‌న వ్యూహాలు, నిర్ణ‌యాల‌తో ప‌రోక్షంగా నరేంద్ర మోడీకి ల‌బ్ది చేకూర్చుతున్నార‌న్న అనుమానాలు వ‌స్తున్నాయ‌ట‌. 

ఈ విష‌యంపై తాజాగా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా రాజ‌కీయ పండితులు చెబుతున్నారు. మ‌రోసారి న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని అయితే, అందుకు రాహుల్ గాంధీనే బాధ్య‌త వ‌హించాల‌న్న కేజ్రీవాల్ మాట‌ల‌ను కొట్టిపారేయ‌డానికి లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో త‌మ బ‌లం కంటే ఎదుటి వారి బ‌ల‌హీన‌తే ఎక్కువ శాతం క‌ల్సొస్తుంది. 

ఇది రాహుల్ గాంధీ అర్థం చేసుకోవ‌డం లేద‌నేది కేజ్రీవాల్ ఆరోప‌ణగా చెబుతున్నారు. ఎందుకంటే, మోడీ వ్య‌తిరేక కూట‌మిని ఏక‌తాటి మీద‌కు తేవ‌డంలో రాహుల్ గాంధీ ఓ ర‌కంగా విఫ‌లం అయ్యారు. ఎన్నీ సీట్లు వ‌స్తాయో చెప్ప‌లేని స్థితిలో ఉన్న తెలుగుదేశం, డీఎంకేల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న రాహుల్ గాంధీ, శ‌ర‌ద్ ప‌వార్, అఖిలేష్ యాద‌వ్, మ‌మ‌త బెన‌ర్జీల‌ను దారిలోకి తెచ్చుకోవ‌డంలో ఓ ర‌కంగా విఫ‌లం అయ్యార‌ట‌. ముఖ్యంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేక‌పోవ‌డంతో, అక్క‌డ త్రిముఖ పోటీ నెల‌కొంది. 

దీంతో ఆప్, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ఓట్ల చీలిక ఏర్ప‌డి, అది బీజేపీకి లాభం చేకూరుస్తుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. అదే ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటే బీజేపీ ఇబ్బంది ప‌డ‌టం ఖాయం. అలాగే యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూట‌మికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ బ‌రిలో దిగింది. అంటే ఇక్క‌డ కూడా ఓట్ల చీలిక‌తో బీజేపీకి ల‌బ్దిగా మారే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అటు కేర‌ళ‌లో బ‌లం పుంజుకున్న బీజేపీని క‌ట్ట‌డి చేయడానికి అధికార‌ లెఫ్ట్ పార్టీ కూట‌మి సై అంటోంది. 

ఇక్క‌డ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల‌ను టార్గెట్ చేసింది. కాక‌పోతే కేర‌ళ‌లో బీజేపీకి అనుకున్నంత బ‌లం లేక‌పోయినా, క‌నీసం రెండు సీట్లు అయినా రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టి దాకా కేర‌ళ‌ నుంచి ఒక్క బీజేపీ ఎంపీ కూడా గెల‌వలేదు. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ క‌నీసం రెండు సీట్లు గెల్చుకుంటే, వ‌చ్చే కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో లెఫ్ట్ పార్టీల‌తో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది ప‌డ‌టం ఖాయం. పైగా రాహుల్ గాంధీ కూడా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి పోటీ చేయ‌డం అంటే, ఓట్ల చీలిక కోస‌మే అన్న‌ది కేజ్రీవాల్ అభిప్రాయంగా చెబుతున్నారు. 

ఈ నిర్ణ‌యం బీజేపీకి కొద్దో గొప్పో లాభం ద‌క్కిస్తుంద‌నేది ఆయ‌న అనుమానం. అలాగే ప‌శ్చిమ బెంగాల్లో కూడా అధికార త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ స‌వాల్ విసురుతోంది. ఇక్క‌డ కామ్రేడ్లు మూడో స్థానంలో ఉన్నార‌ట‌. ఇక్క‌డ టీఎంసీతో కానీ, లెఫ్ట్ పార్టీల‌తో కానీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే, ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌చ్చినా, బీజేపీకి చాలా మైన‌స్ అవుతుంది. 

ఈ విష‌యం తెల్సినా రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ అయ్యార‌న్న‌ది కూడా ఆలోచించాల్సి వ‌స్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే ఇక్క‌డ పొత్తుకు రాహుల్ గాంధీకి రెండు ర‌కాల ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు మ‌మ‌త బెన‌ర్జీ నో చెప్పారు, ఒక‌వేళ లెఫ్ట్ పార్టీల‌తో క‌ల్సొవెళ్దామా అంటే, కేర‌ళ‌లో ఈ రెండు పార్టీలు కాలుదువ్వుతున్నాయి. అంటే ఏ ర‌కంగా కుదిరే ప‌నికాదని అర్థం అవుతుంది. ఈ స‌మీక‌ర‌ణాల‌ను ఆలోచించే రాహుల్ గాంధీ మీద‌ కేజ్రీవాల్ ఆరోప‌ణ చేశార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle