newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేజ్రీవాల్‌ని కొట్టినా కేసు పెట్టలేదు

06-05-201906-05-2019 06:59:10 IST
2019-05-06T01:29:10.453Z06-05-2019 2019-05-06T01:29:07.866Z - - 14-04-2021

కేజ్రీవాల్‌ని కొట్టినా కేసు పెట్టలేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని మళ్ళీ కొట్టారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మోతీనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా దాడి చేశాడు. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లిన ఆ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు. ఆప్ కార్యకర్తలు షాకయ్యారు. 

కేజ్రీవాల్‌పై దాడి చేసిన వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. అసలెందుకు దాడి చేశాడన్నది ప్రశ్నగా మిగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి చెంది, విసుగొచ్చి... ఆ కోపంతో కేజ్రీవాల్‌పై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. 33 ఏళ్ల ఆ యువకుణ్ని సురేష్‌గా గుర్తించారు.

స్థానికంగా తుక్కును తరలించే డీలర్. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు. పార్టీ సమావేశాలు, ర్యాలీలకు నిర్వాహకుడిగా కూడా పనిచేశాడని చెబుతున్నారు. అందువల్లే అతను కేజ్రీవాల్‌ని అంత ఈజీగా చేరగలిగాడని తెలిసింది.

నిజానికి కేజ్రీవాల్ చెంపపై కొట్టినందుకు అక్కడే ఉన్న ఆప్ కార్యకర్తలు రెచ్చిపోయారు. దెబ్బలు కొట్టారు. వెంటనే తేరుకున్న పోలీసులు అతన్ని పక్కకి లాగి, ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలా ఉంటే... అతను ఆప్ కార్యకర్త కాదనీ, మోదీ భక్తుడని అతని భార్యే చెబుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చెయ్యలేదు. ఎందుకంటే ఎవరూ సురేష్‌కి వ్యతిరేకంగా కేసు పెట్టలేదు. దాన్ని బట్టీ చూస్తే... అతను ఆప్ కార్యకర్తే కావచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి.

గతంలో  బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుపై ఒక వ్యక్తి చెప్పు విసరగా,  పాటిదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్థిక్ పటేల్ కూడా సభల్లో దెబ్బలు తిన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle