newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

23-01-202023-01-2020 13:24:00 IST
2020-01-23T07:54:00.274Z23-01-2020 2020-01-23T07:53:57.191Z - - 20-04-2021

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా పూర్తి కాగా పార్టీలు అక్కడ హోరాహోరీగా ప్రచారం కూడా చేస్తున్నాయి. అయితే సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మొత్తం 93 అభ్యర్థులు పోటీకి దిగడం ఇప్పుడు దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఢిల్లీలో ఏం జరుగుతుందని దేశ రాజకీయాలలో ఆసక్తిగా మారింది.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే మంగళవారం నామినేషన్ల దాఖలు చివరి రోజు కావడంతో కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లారు. అయితే అక్కడ భారీ క్యూ ఉంది. క్యూలో నిలబడిన వ్యక్తులు తమ నామినేషన్ల దాఖలు తర్వాతనే కేజ్రీవాల్ నామినేషన్ సెట్ తీసుకోవాలని పట్టుబట్టడం విశేషం.

దీంతో ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కేజ్రీవాల్‌ కూడా అందరితో సమానంగా టోకెన్‌ తీసుకున్నారు. ఆయన టోకెన్‌ నంబర్‌  45 వచ్చేసరికి సాయంత్రం 6.30 గంటలకు కాగా అప్పుడు కేజ్రీవాల్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఇక కేజ్రీవాల్ పై మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి కాగా శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకి చివరి తేదీ.

అయితే నామినేషన్లు దాఖలు చేసిన 93 అభ్యర్థులు ఉపసంహరించుకునే ఆలోచన లేదని చెప్పడం విశేషం. వీరిలో  పదిమంది ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్  కార్పొరేషన్ (డీటీసీ) మాజీ కాంట్రాక్టు ఉద్యోగులు, ఐదుగురు క్యాబ్‌ డ్రైవర్లు, అలానే 2011లో భారత అవినీతి నిరోధక ఉద్యమంలో పాల్గొన్న నలుగురు సామాజిక కార్యకర్తలు కూడా నామినేషన్లు వేశారు. వీరితోపాటు ‘చక్‌ దే ఇండియా’ సినిమాలో అతిథిపాత్ర పోషించిన జాతీయ హాకీ క్రీడాకారుడు నామినేషన్‌ దాఖలు చేశారు.

కాగా, వీరంతా కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగానే నామినేషన్లను దాఖలు చేశామని.. ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని బరిలో నిలిచి తీరుతామని చెబుతున్నారు. డీటీసీ కాంట్రాక్టు ఉద్యోగులలోని మనోజ్‌ శర్మ అనే వ్యక్తి మాట్లాడతూ.. కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేసినందుకు తమను కేజ్రీవాల్‌ విధుల్లో నుంచి తొలగించారని, తనను ఓడించడానికి బరిలో ఉన్నానన్నారు.

ఇక, ఓ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆటోరిక్షా ఛార్జీలు సవరించారు కానీ, టాక్సీ డ్రైవర్లను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే పోటీకి దిగానని చెప్పారు. అయితే, ఇదంతా బీజేపీ తెరవెనుక ఆడిస్తున్న డ్రామాలుగా ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే బీజేపీ సీఎం తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులు, సంక్షేమం అందలేదని క్యాబ్ డ్రైవర్లను ఉసిగొల్పి బరిలోకి దింపారని విమర్శిస్తున్నారు. మరి ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   12 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   16 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   13 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   20 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle