newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్ర సర్వీసుల్లోకి ఎల్వీ..! హామీఇచ్చిన బీజేపీ పెద్దలు?

06-11-201906-11-2019 12:01:08 IST
2019-11-06T06:31:08.168Z06-11-2019 2019-11-06T06:31:04.935Z - - 23-04-2021

కేంద్ర సర్వీసుల్లోకి ఎల్వీ..! హామీఇచ్చిన బీజేపీ పెద్దలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లి రాజకీయ వర్గాల్లోనూ తరచుగా వినిపిస్తున్న పేరు. అంత అవమానకర రీతిలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఎల్వీపై బదిలీ వేటువేసింది. దేశంలోనే ఎక్కడా సీఎస్‌ బదిలీ ఇంత అవమానకరంగా జరగలేదనేది అధికార వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఎల్వీ సుబ్రహ్మణ్యం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తి అని తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిన విషయం. 2019 అసెంబ్లి ఎన్నికల ముందు సీఎస్‌గా ఎల్వీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారాడు. ప్రతీ విషయంలోనూ అడ్డుపడుతూ.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయం విధితమే. ఎన్నికల అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్‌రెడ్డి సీఎస్‌గా ఎల్వీనే కొనసాగించారు.

ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల పాటు ఎల్వీని దగ్గరకు తీసిన సీఎం జగన్‌.. ఒక్కసారిగా ఎల్వీని దూరంపెడుతూ వచ్చాడు. గత కొద్దికాలంగా సీఎస్‌ ఎల్వీపై బదిలీవేటు పడుతుందని భావించినప్పటికీ.. ఇంతటి అవమానకర రీతిలో ఎల్వీపై బదిలీవేటు వేయటం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. జగన్‌ ఆకస్మిక నిర్ణయం అధికార వర్గాల్లోనూ తీవ్ర కలకలంరేపింది.

ఎల్వీ బదిలీవేటు వెనుక బలమైన కారణం కూడా ఉందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం బీజేపీ లైన్‌లో ఉన్నారన్న కారణంగానే.. జగన్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ప్రచారం సాగుతుంది. బీజేపీ లైన్‌ అంటే హిందూత్వమే. ఆలయాల్లో అన్యమతస్తుల ఏరివేతకు ఆయన భిన్నమైన మార్గాలను అన్వేషించారు. ఆరోపణలు ఉన్న ఉద్యోగుల ఇళ్లపై ఆకస్మిక దాడులు చేయించారు. ఇతర మతాల ప్రార్థనలు చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చర్యలు తీసుకున్నారు.

అలాగే ఆలయ భూముల విషయంలో ఏపీ బీజేపీ నేతల వాదనను సమర్థించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయ భూములు పేదల ఇళ్ల స్థలాల పంపిణీకోసం తీసుకోకూడదనుకున్నారు. ఓ రకంగా ఎల్వీ బీజేపీ ఎజెండానే అమలుచేసే ప్రయత్నంలో తన పదవి పోగొట్టుకున్నారన్న సానుభూతి.. అటు బీజేపీ వర్గీయుల్లోనూ, ఇటు బీజేపీకి మద్దతుగా ఉండే ఆలిండియా సర్వీసు ఉద్యోగుల్లోనూ ఉంది.

ఈ పరిణామాలతో ఎల్వీని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం వద్ద కీలక వర్గాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎల్వీకి కేంద్రం నుంచి సమాచారం అందించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరు నెలల్లో రిటైర్‌ కాబోతున్నారు. రిటై ర్‌ అయినప్పటికీ సర్వీసులో కొనసాగించే కీలకమైన పదవినే బీజేపీ ఆఫర్‌ చేయబోతోందన్న ప్రచారం ఢిల్లి లో ఉధృతంగా సాగుతోంది.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   4 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle