కేంద్ర మాజీ మంత్రి రఘు వంశ్ ప్రసాద్ ఇకలేరు..!
13-09-202013-09-2020 15:23:05 IST
2020-09-13T09:53:05.106Z13-09-2020 2020-09-13T09:53:01.247Z - - 15-04-2021

కేంద్ర మాజీమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కన్నుమూశారు. శనివారం నాడు ఆయన ఆరోగ్యం విషమించిందంటూ వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్ వయసు 74 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా, చికిత్స తీసుకుని కోలుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీలో కీలక నేతగా ఉన్న రఘువంశ్ గురువారం నాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 32సంవత్సరాల పాటు ఆయన ఆర్జేడీ పార్టీలో కొనసాగారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా రఘువంశ్ ప్రసాద్‌కు పేరు ఉంది. తన రాజకీయ ప్రత్యర్థి రామ సింగ్ ఆర్జేడీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా చేసి, పార్టీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రఘువంశ్ ప్రసాద్ పదవిలో ఉన్నప్పుడే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు. బీహార్‌లోని వైశాలీ నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఆ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు ఆయనకు అంతగా కలిసి రాలేదు. రఘువంశ్ ప్రసాద్ మరణంపై పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రఘువంశ్ ప్రసాద్ కు నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం రఘువంశ్ మరణ వార్త తెలుసుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ‘‘ప్రియమైన రఘువంశ్ బాబు! ఏం చేశావు నువ్వు? నువ్వు ఎక్కడికీ వెళ్ళడం లేదని నేను మొన్ననే నీకు చెప్పాను. కానీ నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. నాకు మాటలు రావడం లేదు. నేను చాలా విచారంగా ఉన్నాను. నేను నిన్ను ఎంతో కోల్పోతున్నాను’’ అని ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి తదితరులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

నా రూటే సెపరేటు
8 minutes ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
14 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
14 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
14 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
18 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
19 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
18 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
20 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
20 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
16 hours ago
ఇంకా