కేంద్ర మంత్రులయ్యేది వీరేనా..?
26-05-201926-05-2019 16:24:27 IST
Updated On 26-06-2019 15:35:52 ISTUpdated On 26-06-20192019-05-26T10:54:27.454Z26-05-2019 2019-05-26T10:54:23.505Z - 2019-06-26T10:05:52.727Z - 26-06-2019

గత కేంద్ర క్యాబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. అంతకుముందు ఉన్న యూపీఏ 2లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 10 మందికి కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు రాష్ట్రం నుంచి రావడంతో ప్రభుత్వంలో కూడా ఉమ్మడి ఏపీకి మంచి ప్రాధాన్యతే లభించింది. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో మొదట ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. టీడీపీ ఎంపీలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కేంద్రమంత్రులయ్యారు.
తెలంగాణలో బీజేపీ నుంచి ఒక్క బండారు దత్తాత్రేయ మాత్రమే గెలవడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు ఆయన పదవి కూడా పోయింది. ఏపీలోనూ ఏడాది ముందే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో మంత్రులు రాజీనామా చేశారు. దీంతో గత ప్రభుత్వంలో చివరి ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు.
అయితే, ఈసారి తెలంగాణలో ఏకంగా నలుగురు బీజేపీ ఎంపీలు విజయం సాధించారు. ఇక్కడ ఆ పార్టీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటోంది. దీంతో ఈసారి కచ్చితంగా ఒకరిని లేదా ఇద్దరిని రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ నేత అయినా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి క్యాబినెట్ లో చోటు దక్కడం ఖాయమే అంటున్నారు.
సీనియర్ నేత కావడం, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉండటంతో పాటు పార్టీ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అన్నింటికీ మించి తెలంగాణ రెడ్డి సామాజకవర్గాన్ని ఆకట్టుకోవాలనేది బీజేపీ వ్యూహమని తెలుస్తోంది. దీంతో కిషన్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోవచ్చు. ఆయన 2014లోనే ఎంపీగా పోటీ చేసి క్యాబినెట్ లోకి వెళ్లాలని ఆశించినా అప్పుడు పార్టీ దత్తాత్రేయకు మరో అవకాశం ఇవ్వడంతో కిషన్ రెడ్డి ఛాన్స్ మిస్ అయ్యింది. ఈసారి మాత్రం కిషన్ రెడ్డిని కేంద్రమంత్రిగా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ మరొకరిని సైతం రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలనుకుంటే మాత్రం నిజామాబాద్ లో కవితను ఓడించిన ధర్మపురి అర్వింద్ లేదా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కూడా అవకాశం దక్కవచ్చు. వీరిద్దరూ అనూహ్య విజయం సాధించడంతో పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ బీసీలు కావడంతో ఒకరికి అవకాశం దక్కవచ్చు.
ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ నేతలకే ఒకరికి లేదా ఇద్దరి మంత్రి పదవులు దక్కవచ్చు. ఈ రేసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముందున్నారట. ఆయనకు ఇప్పటికే పార్టీ అధిష్టానం ఎంపీగా గెలిచినా ఓడినా రాజ్యసభ అవకాశం ఇచ్చి కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పటికే యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తెలుగు వ్యక్తి జీవీఎల్ నరసింహారావు కూడా రేసులో ఉన్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి సైతం కేంద్రమంత్రి రేసులో ఉన్నట్లు సమాచారం. మరి, ఈసారైనా ఎన్డీఏ తెలుగు రాష్ట్రాలకు క్యాబినెట్ లో ప్రాధాన్యత ఇస్తే ఎవరు కేంద్రమంత్రులు అవుతారో చూడాలి.

ఏపీలో స్కూల్స్ బంద్
13 hours ago

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?
12 hours ago

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
17 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
18 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
14 hours ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
20 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
21 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
13 hours ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
15 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
21 hours ago
ఇంకా