newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

కేంద్ర ప్రభుత్వం నోటీసులను చించేస్తారా.. వాళ్లు అదే పని చేశారు..!

12-09-202012-09-2020 08:51:22 IST
2020-09-12T03:21:22.439Z12-09-2020 2020-09-12T03:21:19.964Z - - 21-10-2020

కేంద్ర ప్రభుత్వం నోటీసులను చించేస్తారా.. వాళ్లు అదే పని చేశారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అసలు పడడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకులు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని చెప్పారు. తాజాగా అదే బాటలో ఢిల్లీ ప్రభుత్వం పయనించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను మీడియా ముందే చింపేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

ఢిల్లీ రైల్వే ట్రాక్ వెంబడి మురికివాడల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా ఆ నోటీసులను ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చందా చింపివేయడం సంచలనం అయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు తప్పని మీడియాకు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి సరికాదని.. ఈ నోటీసులపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బతికున్నంత కాలం మురికివాడల్లోని ప్రజలను ఖాళీ చేయించడం ఎవరి తరం కాదని అన్నారు. సరైన పునరావాసాన్ని కల్పించాక అక్కడి నుంచి వారిని ఖాళీ చేయిస్తామని చెప్పారు.

కేంద్ర నోటీసులను చించేయడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుబట్టింది. ఇలాంటి పని చేయడం నేరమని అంటోంది. మురికివాడలను ఖాళీ చేయించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించిందని.. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఆ మాత్రం క్లారిటీ లేదా బీజేపీ నేతలు ఆరోపించారు.

రాఘవ్ చందా చేసిన పని ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి పొసగడం లేదన్న విషయం మరోసారి రుజువు చేసింది. ఇప్పటికే కేజ్రీవాల్ చేయాలనుకున్న చాలా పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డు పడిందని ఆప్ నేతలు బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇలా మీడియా సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నోటీసులు చించేయడం ద్వారా ఆ వైరం మరింత పెరిగేలా చేసింది. ఈ నోటీసులు చించేసే వ్యవహారం కేజ్రీవాల్ కనుసన్నులలో జరిగిందా లేక రాఘవ్ చందా చేసిన పనా అన్నది కూడా తెలియాల్సి ఉంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle