newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?

07-08-202007-08-2020 11:02:00 IST
Updated On 07-08-2020 13:31:05 ISTUpdated On 07-08-20202020-08-07T05:32:00.832Z07-08-2020 2020-08-07T05:31:53.895Z - 2020-08-07T08:01:05.630Z - 07-08-2020

కేంద్ర క్యాబినెట్ విస్త‌ర‌ణకు వేళ‌య్యిందా..? కొత్త‌గా మంత్రుల‌య్యేది వీరేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్డీఏ 2.0 ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌టిపాకి క్యాబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌నే ఆలోచ‌న‌తో కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌ని జాతీయ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఆగ‌స్టు 15వ తేదీ లోపే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్ర క్యాబినెట్‌లో 81 మంది మంత్రులు ఉండే అవ‌కాశం ఉంది. కానీ, ప్ర‌స్తుతం మోడీ ప్ర‌భుత్వంలో 57 మంది మంత్రులు మాత్ర‌మే ఉన్నారు. అంటే కేంద్ర క్యాబినెట్‌లో మ‌రో 24 మందికి చోటు ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది. అయితే, ఇప్పుడు క్యాబినెట్ విస్త‌ర‌ణ చేసి ఎంత మందిని తీసుకుంటార‌నేది క్లారిటీ లేదు కానీ విస్త‌ర‌ణ మాత్రం ఉంటుంద‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

ఇందుకు సంబంధించి కొత్త క్యాబినెట్‌లో చేరే వారు వీరే అంటూ ప‌లు పేర్లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింథియా పేరు ఇందులో ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇటీవ‌లే బీజేపీ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించింది. కేంద్ర మంత్రిని చేయ‌డానికే ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేశార‌నేది బ‌హిరంగంగానే చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి ఆయ‌నకు బీజేపీలోకి వెళ్ల‌క‌ముందే ఈ హామీ ల‌భించింద‌నే ప్ర‌చారం కూడా ఉంది.

మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ‌రైనా కొత్త‌గా క్యాబినెట్‌లోకి వెళ్ల‌బోతున్నారా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార‌, విప‌క్ష పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు త‌మ పార్టీకి అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌ని బీజేపీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త‌గా కొంద‌రిని మంత్రివ‌ర్గంలోకి తీసుకొని రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశంగా మ‌లుచుకోవాల‌నే ఆలోచ‌న‌తో బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. నిజానికి బీజేపీ హ‌యాంలో కేంద్ర మంత్రివ‌ర్గంలో తెలుగు రాష్ట్రాల‌కు స‌రైన ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేదు.

యూపీఏ ప్ర‌భుత్వంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి 10 మందికి పైగా కేంద్ర మంత్రులు ఉండేవారు. కానీ, మోడీ మొద‌టి సారి అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ నుంచి కేవ‌లం బండారు ద‌త్తాత్రేయ‌కు స్వ‌తంత్ర హోదాతో కూడిన మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మిత్ర‌ప‌క్షం టీడీపీ త‌ర‌పున అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సుజ‌నా చౌద‌రికి మాత్ర‌మే మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ఇచ్చారు. త‌ర్వాత బీజేపీ - టీడీపీ బంధం బీట‌లు వారిన త‌ర్వాత వీరిద్ద‌రూ మంత్రి ప‌ద‌వులు వ‌దులుకున్నారు. త‌ర్వాత ఎవ‌రికి ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా లేరు.

మోడీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక కేంద్ర మంత్రివ‌ర్గంలో తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డికి ఛాన్స్ వ‌స్తుంద‌ని అంతా ఊహించిన‌ట్లే జ‌రిగింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయ‌న‌కు ఒక్క‌రికి ఛాన్స్ వ‌స్తుంద‌నేది మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. కేవ‌లం కిష‌న్ రెడ్డి స‌హాయ మంత్రి ప‌ద‌విని మాత్ర‌మే ఇచ్చి ఊరుకుంది బీజేపీ. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే క‌చ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి మ‌రి కొంద‌రిని క్యాబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

తెలంగాణ నుంచి చూస్తే బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముర‌ళీధ‌ర‌రావు పేరు వినిపిస్తోంది. పార్టీని రాష్ట్రంలో బ‌లోపేతం చేయ‌డానికి నాయ‌క‌త్వాన్ని ప‌టిష్టం చేసుకోవ‌డానికి కొత్త ఎంపీలు బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర్వింద్‌, సోయం బాపూరావుకు ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎవ‌రికి ఛాన్స్ వ‌స్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీ నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా లేనందున ఈ సారి ఒక్క‌రికైనా ఛాన్స్ ల‌భించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీకి టీడీపీ నుంచి వెళ్లిన ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌, టీజీ వెంక‌టేశ్ ఉన్నారు. వీరిలో సుజ‌నా చౌద‌రి ఇప్ప‌టికే మంత్రివ‌ర్గంలో ప‌ని చేసి ఉండ‌టంతో పాటు ఆయ‌న‌కు కేంద్ర పెద్ద‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి.

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్ పేరు చాలా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న బీజేపీ వ్యూహ‌కర్త‌ల్లో ప్ర‌ధాన వ్య‌క్తి. ఏ మాత్రం ప‌ట్టు లేని రాష్ట్రాల్లో బీజేపీకి విజ‌యాలు అందించారు. దీంతో ఆయ‌న పేరు కూడా కేంద్ర క్యాబినెట్ రేసులో వినిపిస్తోది. మ‌రో నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పేరు కూడా ప‌రిశీలించ‌వ‌చ్చు. వీరిద్ద‌రిని క్యాబినెట్‌లోకి తీసుకుంటే ఇత‌ర రాష్ట్రాల నుంచి రాజ్య‌స‌భ‌కు పంపించాల్సి ఉంటుంది.

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   16 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle