newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్ర ఉద్యోగులు ఈ గైడ్ లైన్స్ పాటించాల్సిందే!

09-06-202009-06-2020 12:51:26 IST
Updated On 09-06-2020 14:50:23 ISTUpdated On 09-06-20202020-06-09T07:21:26.779Z09-06-2020 2020-06-09T07:21:22.476Z - 2020-06-09T09:20:23.422Z - 09-06-2020

కేంద్ర ఉద్యోగులు ఈ గైడ్ లైన్స్ పాటించాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా కేసుల సంఖ్య మూడులక్షలకు చేరువ కావడం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఏరోజుకారోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో 9,987 కేసులు నమోదుకాగా, మహమ్మారి బారినపడి 331 మంది చనిపోయారు. 

దీంతో మొత్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,66,598కు చేరింది. కాగా.. మృతుల సంఖ్య 7,466కు పెరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1,29,215 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,29,917 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 88,529 కరోనా కేసులు నమోదవ్వగా.. 3,169 మంది చనిపోయాని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. కోవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 

దేశంలో వారంలో కేసులు తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగించింది. వారంలో దేశంలో 67 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఎక్కువే. ఏకంగా 1868 మంది మరణించారు. కేసుల తీవ్రత విషయంలో భారత్ ఐదవ స్థానానికి చేరింది. మరణాల సంఖ్యలో 12వ స్థానంలో వుంది. 

దేశంలో టాప్ 5 స్థానాల్లో మహారాష్ట్ర (88,528), తమిళనాడు (33,229), ఢిల్లీ (29, 943), గుజరాత్ (20,545). యూపీ (10,947), రాజస్థాన్ (10763). మధ్యప్రదేశ్ (9,638), పశ్చిమబెంగాల్ (8,613) కేసులు నమోదయ్యాయి. ఏపీ 4851 కేసులు, తెలంగాణలో 3650 కేసులు నమోదయ్యాయి. 

పరిస్థితుల తీవ్రత నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతినిస్తున్నట్టు, మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలి. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. 

ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది. అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దని, కార్యాలయాల విధులకు సంబంధించి ఇంటర్ కాం లోనే మాట్లాడుకోవాలని తెలిపింది. మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా వాడాలని, మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. 

సాధ్యమయినంత వరకూ వివిధ శాఖలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. తమను తాము కాపాడుకొని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్యోగులంతా తాజా మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్రం సూచించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle