కేంద్రం శుభవార్త.. తీరనున్న పసుపు రైతుల చిరకాల వాంఛ?
16-01-202016-01-2020 09:04:50 IST
2020-01-16T03:34:50.327Z16-01-2020 2020-01-16T03:34:37.561Z - - 23-04-2021

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత ఆరేళ్ళగా డిమాండును మించి ఉద్యమం వరకు వెళ్ళింది. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పసుపు కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు తెలంగాణకు పసుపు కేంద్రం కావాలని భారీగా డిమాండ్లు వినిపించాయి. ఒకదశలో రైతులంతా సంఘటితమై దీనిని ఉద్యమంగా మార్చి ఢిల్లీవరకు తీసుకెళ్లారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన కేసీఆర్ కుమార్తె కవిత పసుపు బోర్డుకి హామీ ఇచ్చినా అమలు సాధ్యం కాలేదు. దీంతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో రైతులు మూకుమ్మడిగా కవితపై పోటీచేసి ఎన్నికలలో గందరగోళం చేశారు. అదే సమయంలో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ బీజేపీ నుండి పోటీచేసి అదే పసుపు బోర్డు హామీతో గెలిచారు. ఎన్నికలై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా నిజామాబాద్ కు పసుపు బోర్డు మాత్రం రాలేదని తెరాస, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు కూడా చేస్తుంటారు. ఎంపీ అరవింద్ ఈ విషయంలో పలుసార్లు కేంద్ర పెద్దల వద్ద వినతులు ఇస్తూనే ఉన్నారు. కాగా.. త్వరలోనే నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరబోతున్నట్లుగా తెలుస్తుంది. కేంద్రం త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో పసుపు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు కేంద్రంతో పాటు తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్‌ను కూడా కేంద్రం చేర్చనుందని.. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలకు కేంద్రం నుండి అందిన సమాచారంగా తెలుస్తుంది. అయితే కేంద్రం నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్న కేంద్రం పసుపు బోర్డునా? లేక పసుపు హబ్ ఆ అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ మధ్యకాలంలో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు స్థానంలో అంతకి మించి ప్రయోజనాలతో హబ్ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. బోర్డు ఏర్పాటుకు సాంకేతిక సమస్యల దృష్ట్యా ఈ తరహా హబ్ కు మొగ్గు చూపనున్నట్లుగా చెప్పారు. మరి ఇప్పుడు ఏర్పాటు చేయనున్నది బోర్డ్ ఆ హబ్ ఆ అన్నది త్వరలోనే తేలనుంది. ఇక పసుపుతో పాటు సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ ను కూడా కేంద్రం చేర్చాలనుకోవడం హర్షించదగ్గ అంశమే. పండగ హడావుడి తర్వాత మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. దీంతో తెలంగాణ పసుపు రైతుల చిరకాలవాంఛ తీరినట్లుగానే భాబించాల్సి ఉంది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత
2 hours ago

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!
4 hours ago

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
22 minutes ago

గచ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 కరోనా చావులు.. లెక్క చేయని హైదరాబాదీలు
3 hours ago

ఇద్దరూ ఇద్దరే సరిపోయారు
5 hours ago

కరోనా పేషెంట్లకి సంజీవని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా
5 hours ago

కరోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కారణం తెలుసా
6 hours ago

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
a day ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
22-04-2021

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
22-04-2021
ఇంకా