newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రం వద్ద లెక్కలు లేనందున వలస కార్మికులు చనిపోనట్లేనా.. రాహుల్ ధ్వజం

16-09-202016-09-2020 14:30:03 IST
2020-09-16T09:00:03.792Z16-09-2020 2020-09-16T09:00:02.245Z - - 14-04-2021

కేంద్రం వద్ద లెక్కలు లేనందున వలస కార్మికులు చనిపోనట్లేనా.. రాహుల్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మరోసారి నరేంద్రమోదీ సర్కార్‌పై  మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అయితే దీనికి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరగా ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్‌ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ మంత్రి సంతోష్‌ కుమార్‌ గాంగ‍్వర్‌ చెప్పారు. ఇక ఈ విషయంలో మోదీ సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. 

ఎంత మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోగా, ఎంత మందికి నష్టపరిహారం చెల్లించారు అని మరో ప్రశ్న సంధించింది. ఎంత మంది ఉపాధి పోగొట్టుకున్నారో తమ వద్ద లెక్కలు లేవని, ఇక నష్టపరిహారం అనే ప్రశ్నే ఇంత వరకు తమకు రాలేదని పేర్కొన్నారు. ఇక దీనిపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ, ‘మోదీ గవర్నమెంట్‌కు ఎంత మంది ఉద్యోగం కోల్పోయారో, ఎంత మంది చనిపోయారో తెలియదు. మీకు లెక్క తెలియదు అంటే ఎవరు చనిపోలేదని అర్థమా ఎవరు ఉద్యోగం కోల్పోలేదని అనుకోవాలా అని రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం ఎంతమంది వలస కార్మికులు చనిపోయిందీ లెక్కబెట్టలేదు కాబట్టి, రికార్డులు లేవు కాబట్టి లాక్ డౌన్ కాలంలో వలస కార్మికులు ఎవరూ చనిపోయినట్లే లెక్కించాలా అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. లక్షలాది మంది భారతీయ వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వందల కిలోమీటర్లు నడిచి పోవడాన్ని యావత్ ప్రపంచం చూసిందని, రహదారులమీదే ఆకలిదప్పులతో కూలిపోవడం చూసిందని కానీ ఎంతమంది వలసకార్మికులు చనిపోయింది మోదీ ప్రభుత్వానికి తెలీదని రాహుల్ ధ్వజమెత్తారు.

కరోనా సమయంలో 63,07,000 మందికి పైగా వలసదారులను 4,611 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల ద్వారా వివిధ గమ్యస్థానాలకు చేర్చారు.  ఒక సర్వే ప్రకారం 122 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 75 శాతం మంది చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు ఉన్నారు.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   3 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   4 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   4 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   8 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   9 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   7 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   9 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   10 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   5 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle