newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రం మౌనం అర్ధాంగీకార‌మేనా..?

29-12-201929-12-2019 07:28:12 IST
Updated On 31-12-2019 15:20:54 ISTUpdated On 31-12-20192019-12-29T01:58:12.936Z29-12-2019 2019-12-29T01:58:05.321Z - 2019-12-31T09:50:54.795Z - 31-12-2019

కేంద్రం మౌనం అర్ధాంగీకార‌మేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానులు అంటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌కీయ పార్టీల‌న్నీ డైల‌మాలో ప‌డిపోయాయి. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత‌ ఎలా స్పందించాలో అర్థం కాక త‌ల ప‌ట్టుకున్నారు. అన్ని పార్టీల్లోనూ నాయ‌కులు ఎవ‌రి అభిప్రాయాన్ని వారు చెప్పారు. త‌మ ప్రాంత ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దృష్టిలో పెట్టుకొని స్పందించారు. కానీ, క్ర‌మంగా విప‌క్ష పార్టీల‌న్నీ ఒక స్టాండ్ తీసుకున్నాయి. అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలూ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నాయి.

అయితే, భారతీయ జ‌న‌తా పార్టీ వైఖ‌రి మాత్రం ఇంకా గంద‌ర‌గోళంగానే ఉంది. ఆ పార్టీ నేత‌లు క‌చ్చితంగా పార్టీ వైఖ‌రి ఇదీ అని చెప్ప‌డం లేదు. కొంద‌రు నేత‌లు రాజ‌ధాని వ్య‌వ‌హారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని చెబుతున్నారు.

మ‌రికొంద‌రు అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌ప‌వ‌ద్ద‌ని డిమాండ్ చేస్తున్నారు. కొంద‌రు జ‌గన్ నిర్ణయాన్ని స‌మర్థించారు. ఇక సుజ‌నా చౌద‌రి లాంటి కొంద‌రు కొత్త క‌మ‌ల‌నాథులైతే జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన నాటి నుంచి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

జ‌గ‌న్ తన ఇష్టారీతిన మూడు రాజ‌ధానులు చేస్తామంటే కేంద్రం ఊరుకోద‌ని ఆయ‌న ప‌దేప‌దే హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోతామ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తిని క‌లిసి మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని అడ్డుకోవాల‌ని కోరారు. బీజేపీలో ఎవ‌రి వైఖరి ఎలా ఉన్నా అతిమంగా పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చెప్పిందే పార్టీ వైఖ‌రిగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది.

రాజ‌ధాని వ్య‌హారంలో 12 రోజులుగా వార్త‌ల్లో ఉన్నా, అమ‌రావ‌తి రైతులు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాల‌ని వారి ఫోటోలు ప‌ట్టుకొని ఆందోళ‌న‌లు చేస్తున్నా బీజేపీ అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పంద‌నా రావ‌డం లేదు. ప్ర‌స్తుతం బీజేపీకి గ‌డ్డుకాలం న‌డుస్తోంది. ఎన్ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ల‌ను నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌దిద్దుకోవ‌డ‌మే బీజేపీకి బారంగా మారింది.

పైగా మ‌హారాష్ట్ర‌లో అధికారం కోల్పోవ‌డం, ఝార్ఖండ్‌లో ఓడిపోవ‌డం, ఇలా దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇటువంటి స‌మ‌యంలో త‌మ‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్న వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీల‌తో బీజేపీ విభేదాలు కొని తెచ్చుకునే అవ‌కాశాలు త‌క్కువే. అందుకే రాష్ట్రంలో ఇంత జ‌రుగుతున్నా బీజేపీ అధిష్ఠానం మాత్రం ఈ రాజ‌ధాని విష‌యంలో స్పందించ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తిని ఇప్పుడు రాజ‌ధాని కాదంటే ఆయ‌న ఊరుకోర‌ని టీడీపీ, రాష్ట్ర బీజేపీ నేత‌లు చెబుతున్నా కేంద్రం ఇంత‌వ‌ర‌కు ఎటువంటి జోక్యం చేసుకోలేదు.

ఇక‌, ఏపీలో వైసీపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నేత‌లు ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోకుండా రాష్ట్ర ప్ర‌భుత్వంపై టీడీపీతో పోటీ ప‌డి మ‌రీ పోరాడుతోంది. కానీ, రాజ‌ధాని విష‌యంలో మాత్రం అంత తీవ్రంగా పోరాటానికి దిగ‌డం లేదు.

టీడీపీనే రాజ‌ధాని రైతుల ఉద్య‌మానికి అండ‌గా ఉంటోంది. బీజేపీ నేత‌లు రాజ‌ధాని రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇస్తున్నా, వారికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నా అంత‌గా రైతుల‌తో క‌లిసి న‌డ‌వ‌డం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం మౌన‌దీక్ష పేరుతో కొంత‌సేపు దీక్ష చేసి మొక్కుబ‌డిగా అన్న‌ట్లు విర‌మించారు. బీజేపీ అధిష్ఠానం మౌనం జ‌గ‌న్ నిర్ణ‌యానికి అర్థంగీకార‌మేనా అనే భావ‌న క‌లుగుతోంది.

పైగా జ‌గ‌న్ కూడా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు రాజ‌ధాని గురించి, త‌న ఆలోచ‌న గురించి పూర్తిగా వివ‌రించే ముందుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. మొత్తానికి ఏపీ రాజ‌ధానుల వ్య‌వ‌హారంలో బీజేపీ అధిష్టానం మౌనం అర్ధాంగీకారంగానే క‌నిపిస్తోంది.

 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   19 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   17 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle