newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!

20-09-202020-09-2020 11:11:29 IST
Updated On 20-09-2020 11:24:33 ISTUpdated On 20-09-20202020-09-20T05:41:29.571Z20-09-2020 2020-09-20T05:41:26.532Z - 2020-09-20T05:54:33.145Z - 20-09-2020

కేంద్రం తీరు కూటమి ధర్మానికి చేటు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. సంకీర్ణ ధర్మాన్ని పాటించడంలో కేంద్ర సర్కార్ ఎటువంటి  ఇబ్బందీ, సమస్యా లేని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. అంత మాత్రాన సంకీర్ణంలోని భాగస్వామ్య పక్షాలను విశ్వాసంలోనికి తీసుకోవలసిన అవసరం లేదని కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీ భావించడం సరికాదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఈ విశ్లేషణలు ఎందుకు వస్తున్నాయంటే కేంద్రంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వమన్న మాట ఈ ఆరేళ్లలో దేశంలో ఎవరికీ గుర్తు లేని పరిస్థితి నెలకొని ఉంది. ఇందుకు కారణం సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకి ప్రభుత్వ మనుగడకు భాగస్వామ్య పక్షాల అవసరం ఇసుమంతైనా లేకపోవడమే కారణం. దీంతో బీజేపీ భాగస్వామ్య పక్షాల పట్ల ఒకింత చిన్న చూపుతో వ్యవహరిస్తున్నదన్న భావన ఆయా పార్టీలలో కూడా ఉంది.

2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించినప్పటి నుంచీ దేశంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇరత పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కారేనని చెప్పడానికి ఎటువంటి సందేహానికీ తావు లేని పరిస్థితి ఉంది. పేరుకు కేంద్ర కేబినెట్ లో భాగస్వామ్య పక్షాలకు స్థానం కల్పించినా కీలక నిర్ణయాలన్నీ ప్రధాని స్వయంగా తీసుకునే పరిస్థితి ఉంది. దీంతో భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు డమ్మీలుగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్ కాదు...మోడీ సర్కార్. జాతీయ పార్టీగా బీజేపీకి పటిష్టమైన హైరార్కీ వ్యవస్థ ఉంది.  అయితే మోడీ హయాంలోకి వచ్చే సరికి ఆయనకు దీటైనా నాయకులెవరూ బీజేపీలో లేరు. ఆయన కేబినెట్ ను తీసుకున్నా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రవాణా మంత్రి గడ్కరీ మినహాయిస్తే మిగిలిన వారంతా మోడీకి జూనియర్లే...ఆయన గీచిన గీటు దాటని వారే.

దీంతో బీజేపీలో ప్రభుత్వం, పార్టీ అన్న తేడా లేకుండా మోడీ హవాయే నడుస్తోంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి హయాంలో ఎన్డీయే సర్కార్ లో పరిస్థితి ఎలా ఉండేదన్న విషయంపై చర్చ జరుగుతోంది. నాడు వాజ్ పేయి సర్కార్ మనుగడ భాగస్వామ్య పక్షాల మద్దతు పై ఆధారపడి ఉందన్న మాట వాస్తవమే. అయినంత మాత్రాన కూటమికి నాయకత్వం వహిస్తున్న పార్టీ నేతగా, ప్రభుత్వాధినేతగా వాజ్ పేయి ఎన్నడూ పెద్దన్న పాత్ర పోషించిన సందర్భం లేదు. విలువలకు, సంకీర్ణ ధర్మానికీ కట్టుబడి పాలన సాగించారు. ఒకరిద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న చిన్న పార్టీల నుంచి, ప్రభుత్వం కొనసాగేందుకు అత్యంత కీలకమైన పెద్ద పార్టీల వరకూ అన్నిటికీ సమ ప్రాధాన్యత ఇచ్చే వారు. అలా ఇవ్వడం ద్వారానే సమాఖ్య స్ఫూర్తికి ఎక్కడా భంగం కలగకుండా సర్కార్ ను నడిపించారు.

నాడు వాజ్ పేయి టీమ్ లో అద్వానీ, మురళీమనోమర్ జోషీ, యశ్వంత్ సింగ్ వంటి ఉద్ధండులు ఉండేవారు. ఏ అంశంపైనైనా కేబినెట్ లో సమగ్ర చర్చ జరిగేది. ఆ తరువాత సమష్టిగా నిర్ణయం వెలువడేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మోడీ జట్టులో ఆయనకు అత్యంత సన్నిహితులు వినా మరెవరూ లేని పరిస్థితి ఉంది. భిన్నాభిప్రాయానికి తావులేని పరిస్థితుల్లో నిర్ణయాలన్నీ సమగ్ర చర్చ లేకుండానే ఏకపక్షంగా తీసుకుంటున్నారన్న భావన, బాధ భాగస్వామ్య పక్షాల్లో కనిపిస్తున్నది. అయినా ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలు కొనసాగుతున్నాయంటే ఆయా పార్టీలకు ఉన్న అనివార్యతే కారణమని చెప్పక తప్పదు. మోడీ 1.0 హయాంలో అప్పటి మిత్రపక్షమైన తెలుగు దేశం, తృణమూల్ వంటి పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాయి.

మోడీ 2.0 హయాంలో దశాబ్దాల స్నేహాన్ని కాదనుకుని మరీ శివసేన బయటకు వచ్చింది. అకాలీ దళ్ అదే బాటలో కనిపిస్తున్నది. అయిష్టంగానే అయినా పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో కొనసాగడానికి ఆయా పార్టీలకు ఉన్న రాజకీయ అనివార్యతే తప్ప మరో కారణం కనిపించదు. మోడీ హయాంలో ఎన్డీయు భాగస్వామ్య పక్షాలు కూటమిలో సమాన భాగస్వాములుగా కాకుండా తోకపార్టీలుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీకి భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండా లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉండటమే దీనికి కారణం. కానీ కూటమిగా కొనసాగుతూ...భాగస్వామ్య పక్షాలకు భాగస్వామ్యం ఇవ్వకపోవడం కూటమి ధర్మం ఎంత మాత్రం కాజాలదు.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle