newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేంద్రం తీరుపై మన్మోహన్ ఆగ్రహం

16-09-201916-09-2019 08:41:33 IST
2019-09-16T03:11:33.268Z16-09-2019 2019-09-16T03:03:59.832Z - - 15-04-2021

కేంద్రం తీరుపై మన్మోహన్ ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజా రాజకీయ పరిస్థితులపై అసహనంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరిని మరోసారి తప్పుబట్టారు. ఏకపక్ష నిర్ణయాలు సమాఖ్యవాదానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనలను మార్చే విషయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభి ప్రాయాలను తీసుకోవాలని మన్మోహన్ సూచించారు.

వివిధ మంత్రిత్వ శాఖలు ఖర్చు చేయని నిధులను రక్షణ, అంతర్గత భద్రతకు కేటాయిం చేలా మార్గాలను సూచించమన్న ప్యానెల్‌ అభిప్రాయంపై మన్మోహన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఢిల్లిలో జరిగిన ఆర్థిక కమిషన్‌ అదనపు నిబంధనల సూచనలపై జాతీయ సెమినార్‌లో సింగ్‌ మాట్లాడారు. కేంద్రం చర్యలు ఆర్థిక సంఘం సిఫార్సుల నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నారు. 

నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలోని సీఎంల సమావేశం మద్దతు పొందాలి. లేదంటే, రాష్ట్రాల వనరుల కేటా యింపులను కేంద్ర దోచుకునే ప్రయత్నం చేస్తుందన్న భావన ఏర్పడుతుందన్నారు. ఇది మనదేశ సమాఖ్య రాజకీయాలకు, సహకార సమాఖ్య వాదానికి మంచికాదు అని అభిప్రాయపడ్డారు.

పార్లమెంటు ఆదేశం ఏమైనప్పటికీ, ప్రభుత్వం తన అభి ప్రాయాన్ని ఏకపక్షంగా అమలు చేయకుండా, రాష్ట్ర కమిషన్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మన్మోహన్ అన్నారు. దేశంలో ఆర్థికమందగమనం వున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. జీఎస్టీని తగ్గించాలన్నారు.

2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారుస్తామని చెబుతున్న మోడీ ఆశలు నెరవేరే అవకాశాలు తక్కువని విమర్శించారు. ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్‌కు ముందు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. 

ఈమె మన్మోహన్‌ను కలవడం అప్పట్లో సంచలనం రేపింది. అలాగే వాస్తవాల్ని కప్పిపుచ్చే చర్యలను మానుకోవాలని గతంలోనే హితవు పలికారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనానికి మానవ తప్పిదమే కారణమని పేర్కొన్న సంగతి తెలిసిందే. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle